సన్ రైజర్స్ కెప్టెన్సీపై డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?
ఇక తెలుగు ప్రేక్షకులందరూ సన్రైజర్స్ జట్టు ఈసారి ఎలాగైనా కప్పు గెలుస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు. అయితే సన్రైజర్స్ జట్టు మొదలైనప్పటి నుంచి జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. కానీ ఆ తర్వాత బాల్ టాంపరింగ్ విషయంలో రెండేళ్లపాటు నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్... మళ్ళీ ఐపీఎల్ లోకి అడుగు పెట్టలేదు. ఆ తర్వాత సన్రైజర్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను.. కేన్ విలియమ్సన్ తీసుకున్న విషయం తెలిసిందే, విలియమ్సన్ సారథ్యంలో కూడా సన్రైజర్స్ జట్టు అద్భుతంగా రాణించింది అని చెప్పాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మరోసారి... సన్రైజర్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు జట్టు యాజమాన్యం డేవిడ్ వార్నర్ కి అప్పజెప్పింది. తాజాగా దీనిపై స్పందించిన డేవిడ్ వార్నర్.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక కావడం తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సన్రైజర్స్ జట్టులో మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు దక్కటం గొప్ప విశేషం అంటూ తెలిపిన డేవిడ్ వార్నర్ ... ఈసారి ఐపీఎల్ టైటిల్ అందుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాము అంటూ స్పష్టం చేశారు. ఇక ఒక జట్టులో ప్రతి ఒక్కరు కూడా నాయకుడే అంటూ వ్యాఖ్యానించిన డేవిడ్ వార్నర్... తాను ఏ స్థానంలో ఉన్న ఎలాంటి తేడా ఉండదు అంటూ తెలిపాడు. అటు సన్రైజర్స్ జట్టు అభిమానులు కూడా మరోసారి డేవిడ్ వార్నర్ కు కెప్టెన్సి బాధ్యతలు రావడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.Powered by Froala Editor