రాఖీ పౌర్ణమి నాడు తినకూడని వంటలివే ..!

Divya
శ్రావణ మాసంలో వచ్చే మొదటి పౌర్ణమిని మనం రాఖీ పౌర్ణమి అని అంటాము. ఈ రాఖీ పౌర్ణమి నాడు అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్లు రక్షా బంధన్ కట్టి మరి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. చెల్లెళ్లు , అన్నయ్యలకు రాఖీ కట్టడం వల్ల తన అన్న రక్ష చెల్లిపై ఉంటుందని ఎల్లవేళలా ఆమెను కాపాడుతూ వస్తాడు అనేది నమ్మకం. మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించేటప్పుడు, తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు.అలా వదిలినప్పుడు సుదర్శన చక్రం తన చేతికి తగలగానే రక్తం కారడం మొదలవుతుంది.

ఈ సంఘటన చూసిన ద్రౌపది వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా తన చీర కొంగు ను చించి,  శ్రీకృష్ణుడి వేలికి రక్షణగా చుడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నన్ను అన్నగాయ్ భావించి నన్ను ఆపద నుంచి రక్షించావు.. భవిష్యత్తులో నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే నన్ను తలచుకో.. సదా ఎల్లవేళలా నీకు తోడు ఉంటానని అభయం ఇస్తాడు. అలా మయసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రౌపది తన అన్నయ్య శ్రీ కృష్ణుడు ని తేల్చుకోగానే,  ఆయన ద్రౌపది మాన ప్రాణాలను కాపాడాడు. ఈ సంఘటన పౌర్ణమి రోజున జరిగింది కాబట్టి.. ఈ రోజున చెల్లెళ్లు తమ అన్నలకు రక్షగా రక్షాబంధనం కట్టడం ఆనవాయితీగా జరుగుతోంది.
ఇంతటి పవిత్రమైన రోజున కొన్ని వంటలను తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ వంటలు ఏవో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం..
సాధారణంగా ఏదైనా సెలబ్రేషన్స్ అప్పుడు తప్పకుండా మాంసాహారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ రాఖీ పౌర్ణమి రోజున తప్పకుండా మాంసాహారాన్ని నిషేధించాలి . లేకపోతే శరీరానికి సంబంధించిన ఏదో ఒక అనారోగ్యం చుట్టుముడుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. శీతల పానీయాలు, చల్లటి పదార్థాలు తినకుండా ఉండాలి. అలాగే పుల్లటి వస్తువులు, కాకరకాయ వంటివి కూడా తినకూడదు.
ముఖ్యంగా ఈ రోజు గ్లాసు పాలలో, బెల్లం వేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి మంచి చేకూరుతుంది అని కూడా వారు సూచిస్తున్నారు. ఒక కూరలలో వాడేటప్పుడు కళ్ళ ఉప్పును వేసుకోవాలి. గోధుమ పిండితో చేసిన తీపి పదార్థాలు తినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: