హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

Vijaya
అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు అనే సామెత లాగ తయారైపోయింది స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం చూస్తుంటే. పంతానికి పోయి పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన నోటిఫికేషన్ను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేసింది. దాంతో డివిజన్ బెంచ్ కు ఎక్కారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి స్ధానిక సంస్ధల ఎన్నికలను జరపమని ఏ కోర్టు కూడా చెప్పదు. ఇంతచిన్న విషయాన్ని కూడా మరచిపోయి జగన్మోహన్ రెడ్డి మీద కసితో రెచ్చిపోతున్నారు. తన కసిని ఏ విధంగా తీర్చుకోవాలో అర్ధంకాక చివరకు తన సిబ్బంది మీతే చూపుతున్నట్లున్నారు. మంగళవారం ఎలక్షన్ కమీషన్ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి వాణీమోహన్ను విధుల నుండి తొలగించారు. వాణి సేవలు కమీషన్ కు అవసరం లేదని చెప్పి వెంటనే రిలీవ్ చేసేశారు. ఆ విషయాన్ని చీఫ్ సెక్రటరీకి లేఖ ద్వారా తెలియజేయటం ప్రభుత్వ యంత్రాంగంలో కలకలం రేగింది. వాణీని విధుల నుండి తొలగించే అధికారం నిమ్మగడ్డకు లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.


సోమవారం నాడు కమీషన్ జాయింట్ డైరెక్టర్ సాయిప్రసాద్ ను ఏకంగా ఉద్యోగంలో నుండి తేసేశారు. ఉద్యోగంలో నుండి తొలగించటమే కాకుండా ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను కూడా ఆపేశారు. భవిష్యత్తులో ప్రభుత్వంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రూపంలో కూడా సర్వీసు చేయటానికి లేదంటూ ఆంక్షలు విధించారు. అనారోగ్యంగా ఉందని సాయిప్రసాద్ శెలవు పెడితే ఉద్యోగంలో నుండి తొలగించటమే తప్పు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను నిలిపేయటం, ఏ రూపంలో కూడా ప్రభుత్వ సర్వీసు చేయకూడదని ఆంక్షలు విధించటం ఎక్కడా చెల్లదు.  అంటే ఆయనేమో తనిష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుని అమలు చేసేయవచ్చు. ఇదే పని ప్రభుత్వం చేస్తే మాత్రం వెంటనే కోర్టులో కేసు వేసేస్తారు. రాజ్యంగబద్దమైన అధికారాలని, రాజ్యాంబద్ద సంస్ధని నానా గోల చేస్తారు. రాజ్యాంగబద్దమైన సంస్ధ అంటే ప్రభుత్వం నెత్తినెక్కి డ్యాన్స్ చేయమని అర్ధంకాదు.


ఎన్నికల నోటిఫికేషన్ను కోర్టు సింగిల్ బెంచ్ కొట్టేయటాన్ని నిమ్మగడ్డ తట్టుకోలేకపోతున్న విషయం అర్ధమైపోతోంది. అందుకనే ఆ కోపాన్ని కమీషన్లో పనిచేసే అధికారుల మీద చూపుతున్నారు. మార్చిలో రిటైర్ అయిపోయే నిమ్మగడ్డ కమీషన్ సిబ్బంది మొత్తం తన మాటే వినాలని పట్టుబడుతున్నారు. ఇందులో తప్పులేదు. అయితే మార్చిలో రిటైర్ అయిపోతున్న నిమ్మగడ్డ ప్రభుత్వంతో ఎన్నిగొడవలు పెట్టుకుంటున్నా చెల్లుతుంది. కానీ మగిలిన సిబ్బంది విషయం అలా కాదుకదా. వాళ్ళు కూడా నిమ్మగడ్డ మాదిరే ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటే తాము కూడా నిమ్మగడ్డతో పాటు రిటైర్ కావాల్సుంటుంది. ఆ భయంతోనే సిబ్బంది నిమ్మగడ్డకు సహకరించటం లేదు. దాంతో వరుసగా కక్షసాధింపులు చర్యలు మొదలుపెట్టారు. మరి మార్చిలోగా ఎంతమందిపై ఏమేమి చర్యలు తీసుకుంటారో అనే టెన్షన్ మొదలైపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: