హెరాల్డ్ సెటైర్ : జగన్ బంపర్ ఆఫర్...చంద్రబాబుకు షాక్

Vijaya
ఆమధ్య వచ్చిన ఓ సినిమాలో ఆగట్టునుంటావా ? నాగన్న...ఈగట్టునుంటావా ? అంటూ హీరో పాడేపాట గుర్తుందా ? ఇప్పుడచ్చంగా జగన్మోహన్ రెడ్డి అదే మాట అడుగుతున్నారు. ఇళ్ళ పథకాలు రాష్ట్రంలో ఇపుడు హాట్ టాపిక్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కట్టకపోగా తమ హాయంలో కట్టిన 6 లక్షల ఇళ్ళను కూడా లబ్దిదారులకు ఇవ్వటం లేదంటు చంద్రబాబు, లోకేష్+ఎల్లోమీడియా ఒకటే గోల చేసేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  తమ హయాంలో నిర్మాణం అయిపోయిన ఇళ్ళను ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వటం లేదు కాబట్టి వచ్చే సంక్రాంతికి తామే లబ్దిదారులతో ఆ ఇళ్ళల్లో గృహప్రవేశాలు చేయిస్తామని చంద్రబాబు పిలుపిచ్చేశారు. సరే సర్వదా చంద్రబాబు అడుగుజాడల్లోనే నడుస్తున్న సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఇప్పటికే ఇళ్ళ కబ్జాలు మొదలుపెట్టేశారు.



నిజానికి టిడ్కో ద్వారా తమ హయాంలోనే 6 లక్షల ఇళ్ళు నిర్మించిందే నిజమైతే మరి అప్పట్లో చంద్రబాబే ఇళ్ళను లబ్దిదారులకు ఎందుకు ఇవ్వలేదు ? అన్న ప్రశ్నకు ఎల్లోబ్యాచ్  సమాధానం లేదు. సరే రాజకీయ లబ్దికోసమే చంద్రబాబు 24 గంటలూ పాకులాడుతుంటాడనే అనుకుందాం. అందుకే ఈ సమయంలోనే జగన్ హఠాత్తుగా లబ్దిదారులకు ఓ బంపర్ ఆఫరిచ్చారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళు కావాలా ? లేకపోతే ఇపుడు వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ళు కావాలా ? తేల్చుకోమని లబ్దిదారులకే జగన్ ఆఫర్ ఇఛ్చారు. చంద్రబాబు హయాంలో నిర్మించినట్లు చెబుతున్న ఇళ్ళకు, ఇపుడు జగన్ హయాంలో నిర్మిస్తున్న ఇళ్ళకు తేడా ఏమిటి ? ఏమిటంటే చంద్రబాబు నిర్మించినట్లు చెబుతున్న ఇళ్ళు లబ్దిదారుల సొంతం కావలంటే 20 ఏళ్ళు ఆగాలి. అదికూడా నెలకు రూ. 3 వేలు కట్టాలి. అంటే 3 లక్షల రూపాయల విలువైప ఇంటికి ప్రతి లబ్దిదారులు నెలకు 3 వేల రూపాయలంటే 20 ఏళ్ళకు 7 లక్షలు చెల్లించాలి. డబ్బులు పూర్తిగా చెల్లిస్తే కానీ ఇల్లు లబ్దిదారుడి సొంతం కాదు.



ఇక జగన్ హయాంలో నిర్మితమవుతున్న ఇళ్ళు ఏమిటంటే లబ్దిదారుడు ఒకే ఒక రూపాయి చెల్లిస్తే చాలు. అదికూడా ఇంటిని లబ్దిదారుని పేరు మీద అప్పటికప్పుడే రిజిస్టర్ చేయించేస్తారు. ఇంటిపై లబ్దిదారునికే సర్వహక్కులు ఇచ్చేస్తారట. రెండు పద్దతుల్లో లబ్దిదారులకు ఏ పద్దతిలో ఇల్లు కావాలో తేల్చుకోవాలని జనాలకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. డిసెంబర్ 25వ తేదీన అవకాశం ఉన్న వాళ్ళకు ఇళ్ళు లేనివాళ్ళకు ఇళ్ళ స్ధలాలు పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  ఈ సందర్భంలోనే లబ్దిదారులకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. నిజానికి చంద్రబాబు హయాంలో కూడా కొన్ని ఇళ్ళు కట్టారు కానీ అవేవీ లబ్దిదారులకు ఇప్పటికిప్పుడు సొంతం కావు. పైగా నిర్మించిన ఇళ్ళకు కూడా విద్యుత్, డ్రైనేజి, మంచినీటి సౌకర్యాలేవీ లేవు. అందుకనే టీడీపీ హయాంలోనే లబ్దిదారులకు ఇవ్వలేదు. ఈ విషయాలు దాచిపెట్టి చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తు జనాలను రెచ్చగొడుతున్నారు. మరి జగన్ తాజా ఆఫర్ తో జనాలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: