హెరాల్డ్ సెటైర్ : సంచైతా గజపతి ఎందుకు నోరిప్పటం లేదబ్బా ?
ఇటువంటి సంచైతా మేడమ్ కూడా ఎందుకనో మూడు రోజులుగా నోరిప్పటం లేదు. పైడితల్లి అమ్మవారు సిరిమానోత్సవంలో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. సిరిమానోత్సవాన్ని చూసేందుకు ఆనందగజపతిరాజు రెండో భార్య సుధా గజపతిరాజు, కూతురు ఊర్మిళా గజపతిరాజు విజయనగరంలోని పూసపాటి వారి కోటమీదకు చేరుకున్నారు. సుధా అంటే సంచైతకు సవతి తల్లి, ఊర్మిళంటే సవతి సోదరి అవుతారు. సిరిమానోత్సవరం ఊరేగింపు సరిగ్గా కోట ముందుకు వచ్చేసరికి సంచైత వీళ్ళద్దరిపై నోరు పారేసుకున్నదట. వీళ్ళద్దరిని కోట మీదకు ఎవరు రానిచ్చారంటూ అక్కడున్న పోలీసులు, సిబ్బందిని అరిచిందట. దాంతో అవమానంగా భావించిన వీళ్ళు అక్కడి నుండి వచ్చేశారు.
తమకు జరిగిన అవమానాన్ని స్వయంగా ఊర్మిళ తన ట్విట్టర్లో చెప్పుకుని బాధపడ్డారు. తమ విషయంలో సంచైత వ్యవహరించిన తీరును ఆమె తప్పుపడుతు ట్విట్టర్లో కామెంట్ చేశారు. తర్వాత తమకు జరిగిన అవమానం, అన్యాయానికి నిరసనగా కోటలోనే బుధవారం ఆందోళన కూడా చేశారు. తమకు వాదననతో పాటు సంచైత చేసిన అవమానాన్ని రెండు రోజులుగా తల్లీ, కూతుళ్ళిద్దరు వరుసబెట్టి మీడియా ఇంటర్వ్యూల్లో వివరించి చెబుతున్నారు. సంచైత వ్యవహారంపై మండిపోతున్నారు. మరి తనకు వ్యతిరేకంగా మీడియాలో ఇంతగా రచ్చ జరుగుతున్నా సంచైతా మేడమ్ ఎందుకని నోరిప్పటం లేదు ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. చిన్న కామెంటుకు కస్సుమని అంతెత్తున లేచిపడే ఛైర్ పర్సన్ మూడు రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు.