హెరాల్డ్ సెటైర్ : వైసిపి ఎంఎల్ఏలకు చంద్రబాబు విప్ ఎలా జారీ చేస్తాడు ?

Vijaya
హెడ్డింగ్ చదివి కన్ఫ్యూజ్ కాకండి. శుక్రవారం మొదలైన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా టిడిపి జారీ చేసిన విప్ విషయం గురించి స్టోరీ అంతా.  టిడిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలకు చంద్రబాబునాయుడు పేరుతో విప్ జారీ అయ్యింది. నిజానికి రాజ్యసభ ఎన్నికల్లో పార్టీలు జారీ చేసే విప్ లు చెల్లుబాటు కావు. తెలిసే తెలీకో పార్టీలు విప్ లు జారీ చేశాయి.  ఇందులో భాగంగానే టిడిపి తరపున 23 మంది ఎంఎల్ఏలకు విప్ జారీ అవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున 23 మంది ఎంఎల్ఏలు గెలిచినా తర్వాత పరిణామాల్లో ముగ్గురు పార్టీకి దూరం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

చంద్రబాబు, చినబాబుపై ఆరోపణలు చేసిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరామ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీలో తాము టిడిపితో కలిసి కూర్చోలేమని వంశీ, గిరి స్పీకర్ ను కోరినపుడు వీళ్ళకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాడు. కాబట్టి కరణం కూడా వీళ్ళతోనే కూర్చునే అవకాశాలున్నాయి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే ముగ్గురు ఎంఎల్ఏలు పార్టీకి దూరమయ్యారో వెంటనే జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లటం మొదలుపెట్టేశారు.  తమ ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించకుండానే  వైసిపిలో  జగన్  ఎలా చేర్చుకుంటాడంటూ విచిత్రమైన లాజిక్ లు మాట్లాడుతున్నారు చంద్రబాబు అండ్ కో.

ముగ్గురు ఎంఎల్ఏలు పార్టీకి దూరమయ్యారే కానీ వైసిపిలో చేరలేదు. వాళ్ళెవరూ వైసిపిలో చేరుతామని జగన్ను అడగను కూడా లేదు. సభలో ప్రత్యేకంగా  కూర్చోవటంతోనే వాళ్ళెవరూ వైసిపిలో చేరలేదన్న విషయం తెలిసిపోతుంది. మరి అందరికీ తెలిసిన విషయం చంద్రబాబు అండ్ కో కు ఎందుకు తెలీటం లేదు ? తెలీక కాదు కావాలనే జగన్ పై బురద చల్లుతున్నారంతే.  తాజా విషయం ఏమిటంటే చంద్రబాబు చెబుతున్నట్లుగా  ముగ్గురు ఎంఎల్ఏలు వైసిపిలో చేరిపోతే మరి పార్టీ వాళ్ళకు ఏ విధంగా విప్ జారీ చేస్తుంది ? వైసిపిలో చేరిన తర్వాత వాళ్ళు ఇక టిడిపి సభ్యులు కాదు కదా ? తమ సభ్యులు కాని వారికి చంద్రబాబు ఎలా విప్ జారీ చేయిస్తాడు ? అన్నదే కీలకమైన ప్రశ్నలు.

తాజాగా మిగిలిన వాళ్ళతో పాటు ముగ్గురు ఎంఎల్ఏలకూ జారీ అయిన విప్ ద్వారా వాళ్ళని తమ ఎంఎల్ఏలుగానే చంద్రబాబు గుర్తించినట్లు అర్ధమైపోతోంది. అంటే విప్ జారీ చేసేసమయంలో మాత్రం పై ముగ్గురు టిడిపి సభ్యులే. అదే రాజకీయంగా బురద చల్లాలంటే మాత్రం వాళ్ళు వైసిపిలో చేరిపోయారంటూ గోల చేస్తారన్న విషయం తెలిసిపోయింది.  నిజానికి చంద్రబాబు తనను తాను చాలా పెద్ద మేధావిగా అనుకుంటుంటాడు. కానీ తన మార్క్ రాజకీయం అవుట్ డేటెడ్ అన్న విషయం చంద్రబాబుకు తప్ప మిగిలిన అందరికీ అర్ధమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: