ఫుట్ బాల్ లీగ్ ను.. ఐపీఎల్ దాటేస్తుంది?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ప్రపంచ క్రికెట్లో ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందో చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్లో టి20 ఫార్మాట్ కి ఇంతలా ప్రేక్షకాదరణ ఉంది అంటే అందుకు ఐపీఎల్ కారణం అని చెప్పాలి. ఇక ఐపీఎల్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రపంచ క్రికెట్లో కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తూ ఉంది. అందుకే విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ లో ఆడటానికి సరికొత్తగా అనుభవాన్ని సాధించడానికి ఎంతగానో ఇష్టపడుతుంటారు.

 అయితే ప్రతి ఏడాది కూడా ఐపీఎల్ స్థాయి అంతకంతకు పెరిగిపోతూ ఉంది. అయితే గత ఏడాది జరిగినా ప్రసార హక్కుల వేలం ద్వారా ఐపిఎల్ ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ లలో ఒకటిగా మారిపోయింది అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో అన్ని లీగ్ లను వెనక్కి నెట్టి రిచెస్ట్ లీగ్ గా అగ్రస్థానంలో నిలవడం ఖాయమని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అమెరికన్ ప్రీమియర్ లీగ్ కంటే అతిపెద్ద క్రీడా ఈవెంట్ గా మారుతుంది అంటూ అంచనా వేశారు ఆయన.

 భారత లీగ్ ఆర్థిక వృద్దిని అంచనా వేస్తే.. 2040 కల్లా యూఎస్ లోని ఫుట్బాల్ లీగ్ కంటే ఐపిఎల్ విలువ ఎక్కువ అవుతుంది. ఇప్పుడున్న దానికంటే ఆరింతలు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ క్రీడా టోర్నమెంట్ గా ఐపిఎల్ మారుతుంది. ప్రపంచం నలుమూలల్లో కూడా క్రికెట్ ను మరింత విస్తరించడానికి ఫ్రాంచైజీ క్రికెట్ సరిగ్గా సరిపోతుంది. క్రికెట్ ను అభిమానులకు మరింత దగ్గర చేయడానికి ఫ్రాంచైజీ క్రికెట్ ఒక మంచి అడుగు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక క్రికెట్కు మరింత ఊతం ఇచ్చేందుకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా అక్కరకి వస్తుంది అంటూ తెలిపాడు. మహిళల క్రికెట్లో కూడా నాణ్యత మరింత పెరిగే ఛాన్స్ ఉందంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండు మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: