భారత్లో వరల్డ్ కప్ జరగడం.. నిజంగా బాధాకరం?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ ఈ ఏడాది భారత్ వేదికగా జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి బీసీసీఐ అన్ని సన్నాహాలు చేస్తుంది అని చెప్పాలి. అదే సమయంలో ఇక వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఇక ఇప్పుడు భారత్ వేదికగా మరో వరల్డ్ కప్ కూడా ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా భారత్ వేదికగా ఇటీవల ప్రారంభమైన పురుషుల హాకీ ప్రపంచకప్ లో ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది. ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా అన్ని జట్లు కూడా హోరాహోరీగా పోటీ పడుతూ ఇక వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా సత్తా చాటుతూ ఉన్నాయి.

 అయితే కేవలం ఈ ఏడాది మాత్రమే కాదు గత కొన్నేళ్ల నుంచి కూడా వరల్డ్ కప్ భారత్లోనే నిర్వహిస్తూ వస్తున్నారు అని చెప్పాలి. ప్రస్తుత వరల్డ్ కప్ తో కలిపి ఇక దాదాపు మూడు వరల్డ్ కప్ లు వరుసగా భారత్ లోనే నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఇలా అన్ని వరల్డ్ కప్ లు కూడా భారత్ వేదికగానే నిర్వహించాల్సి వస్తున నేపథ్యంలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ అంటే ఎప్పుడు ఒక్కో దేశంలో నిర్వహించాలి.. కానీ ఒక భారత్ వేదిక గానే  నిర్వహించడం ఏంటి అని కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు.

 ఇక భారత్ వేదికగా వరుసగా హాకీ ప్రపంచకప్ జరగడం గురించి బెల్జియం ఆటగాడు ఎలియాట్ వాన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు అని చెప్పాలి. పదే పదే ప్రపంచక భారతలో జరగడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు. గత నాలుగు ప్రపంచ కప్లలో కూడా మూడింటిని భారత్ వేదికగానే నిర్వహించారు. అలా ఎలా ఒకే దేశంలో ఎన్ని వరల్డ్ కప్ లు నిర్వహించడానికి అనుమతి ఇస్తారు అంటూ ప్రశ్నించాడు. డబ్బు వల్లే ఇది సాధ్యమైంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత్లో ఆదరణ ఉంటుంది కనుక ఇక్కడ ఆతిథ్యం ఇస్తున్నారని కానీ.. ఇది క్రీడా స్ఫూర్తిగా విరుద్ధం అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: