మంచిమాట: దొంగ తో స్నేహం చేస్తే తిప్పలు తప్పవు..!!

Divya
ఒకానొక అడవిలో ఒక పులి వుండేది..అది ఆ అడవిలో హాయిగా వేటాడుతూ కాలం గడుపుతూ ఉండేది. దాని స్థావరానికి కొంచెం దూరం లో ఒక పెద్ద చెట్టు పైన కొంగ కూడా స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చెట్టు పైనే నివసిస్తుండేది. ఆజన్మాంతం శత్రువులైన పులి,కొంత ఏనాడు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కానీ ఒకరోజు పులి ఏదో జంతువు ని తింటుంటే ఆ జంతువు కళేబరం ఎముక పులి పళ్ళల్లో ఇరుక్కునీ.. బయటకి రాక చాలా ఇబ్బంది పడింది..అయితే ఆ పులి నొప్పి తో బాధపడుతూ గట్టిగా అరుస్తూ మరింత ఎక్కువగా బాధపడుతోంది.
చివరకి అలసిపోయి మూలుగుతూ పడున్న పులి దగ్గరికి ఏమైందో తెలుసుకోవడానికి చాలా సందేహంగా వచ్చింది కొంగ . పులి తో కొంగ మాట్లాడుతూ..ఏమయ్యింది? ఏమిటి నీ బాధ? నేనేమైనా సహాయం చేయగలనా? అని అడిగింది..ఇక వెంటనే పులి తన సమస్యని చెప్పింది. నీ పొడవైన ముక్కుతో నా పళ్ళ మధ్య ఉన్న ఎముకని తీయగలిగితే.. నేను ఈ బాధ నుంచి బయట పడతాను అంది..అప్పుడు కొంగా  తప్పకుండా తీస్తాను ఏది నోరు తెరిచి చూపించు అని తన పొడవైన ముక్కుతో ఇరుక్కొని బాధ పెడుతున్న ఎముక ముక్క ని లాగి సహాయం చేసింది కొంగ.
అప్పుడు పులి ఆహా! నువ్వు చేసిన సహాయం చాలా పెద్దది. ఈరోజు నుంచి మనం స్నేహితులం అంటూ చాలా తియ్యగా మాట్లాడింది. అమాయకమైన కొంగ దాని మాటలు నమ్మింది. ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకుంటూ పులి తెచ్చిన వేటనీ అప్పుడప్పుడూ తింటూ కాలం గడిపేవారు. కానీ కొన్ని రోజులకి పులికి అసలు వేట దొరకక ఆకలి బాధతో విల విల లాడింది. దాని ఆకలి బాధ ముందు విచక్షణతో స్నేహబంధం కూడా నిలబడలేదు.. కొంగని ఎదురుగా చూస్తుంటే దాన్ని తిని ఆకలి తీర్చుకుంటే తప్పులేదనిపించింది మళ్లీ నోటిలో ఏదో ఇరుక్కున్నట్లు నటించింది. కొంగ సరేన ని సహాయం చేయడానికి పులిని నోరు తెరవమని లోపలికి చూస్తూ ఉండగా గబుక్కున కొరికి దాన్ని చంపేసింది పులి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: