బెంగాల్ ఎన్నికల నిర్వహణ బాధ్యత కేంద్ర సాయుధ పోలీస్ బలగాలదే! టిఎంసికి ఈసీ సమాధానం!

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక నిర్ణయం ఇప్పుడు దేశంలో పెద్ద చర్చనే లేవదీశాయి. అది ప్రజల్లో రాజకీయ నాయకుల్లో హాట్-టాపిక్ గా మారటమే కాదు, ముందుముందు ఇది ఒక పెను వివాదంగా మారే పరిస్థితులు నెలకొంటాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.  కొందరి విషయంలో యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం. మరికొన్ని విషయాల్లో అస్సలు స్పంధించనే స్పంధించట్లేదని నిందని మూటగట్టుకోవలసి వస్తుంది. 

ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలు మరింత పెరిగే అవకాశం ఈ నిర్ణయంతో ఉంటుందని సర్వత్రా వ్యక్తం అవుతుంది. పశ్చిమ బెంగాల్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంచలన ప్రకటన సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనలు సద్దుమణగక ముందే, ఈసీ తీసుకున్న తాజా నిర్ణయం వాతావరణం మరింత వేడెక్కించేలా ఉందని చెప్పాలి. కేంద్ర బలగాలతో భద్రత కల్పించని పక్షంలో తాము ఎన్నికలు నిర్వహించబోమని 'పశ్చిమ బెంగాల్ పోలింగ్ సిబ్బంది' భీష్మించు కోవటంతో ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది.

రానున్న రోజుల్లో జరిగే మూడు దశల లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ నిర్వహించే అన్ని పోలింగ్ స్టేషన్ల లో బెంగాల్ రాష్ట్ర పోలీసులకు బదులుగా, కేంద్ర పోలీస్ బలగాల్ని మొహరించాలని నిర్ణయించారు. గడిచిన నాలుగు దశల పోలింగ్ సందర్భంలోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో, కేంద్ర సాయుధ పోలీసు బలగాల్ని ప్రయోగించటం ద్వారా శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్ చరిత్రలో భారీ ఎత్తున కేంద్ర బలగాల్ని రంగంలోకి దింపటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. రానున్న మూడు దశల్లో జరిగే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ మొత్తంలో 600 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాల్ని రంగంలోకి దించనున్నారు. అవసరమైతే మరో వంద కంపెనీలకు పెంచుతామని ఈసీ ప్రకటించటం గమనార్హం. ఈసీ తీసుకున్న తాజా నిర్ణయంపై మమత బెనర్జీ సర్కారు తీవ్రంగా స్పందించే వీలుందని చెబుతున్నారు. ఏమైనా, ఈసీ నిర్ణయం అనూహ్యంగా ఉండటమే కాదు, విపక్షాలు వేలెత్తి చూపేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

పశ్చిమ బెంగాల్లో గత నాలుగో దశ పోలింగ్ సందర్భంగా కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు వ్యవహరించిన తీరుపై తృణ మూల్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. ప్రిసైడింగ్ అధికారి పిలవనిదే పోలింగ్ కేంద్రాల్లోకి కేంద్ర బలగాలు ప్రవేశించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను మోహరించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ సోమవారం టీఎంసీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కేంద్ర సాయుధ పోలీస్ బలగాల వైఖరి కారణంగా స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేకుండా పోయిందని టీఎంసీ పార్టీ పేర్కొంది. దీనిపై ఈసీ స్పందిస్తూ: 

పోలీసులకుగానీ, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకు గానీ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదు. ప్రిసైడింగ్ అధికారి పిలిస్తే మాత్రమే లోపలికి ప్రవేశించేందు కు అనుమతి ఉంటుంది అని పేర్కొంది. ఇటీవల జరిగిన నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దుబ్రయ్‌పూర్, బీర్భూమ్ నియోజకవర్గాల్లో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు కాల్పులు జరపడంపై తృణమూల్ నేతలు ఈసీకి లేఖ రాశారు.

బీజేపీ సూచనల మేరకే కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు పనిచేస్తున్నాయని వారు ఆరోపించారు. కాగా పశ్చిమ బెంగాల్ పోలీసుల స్థానంలో పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల బాధ్యతలను కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకు అప్పగిస్తూ ఈసీ ఇవాళ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  బెంగాల్ పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్ర పోలీస్ లను ఎన్నికల కార్యక్రమాలకు వినియోగిస్తే అవి టిఎంసీకి అనుగుణంగా పనిచేస్తున్నాయని కేంద్రం అంటుంటే - కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను వినియోగిస్తే అవి బిజెపికి అనుగుణం గా పనిచేస్తుంటాయని ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. పాపం! ఎన్నికల సంఘం మాత్రం ఏం చేస్తుంది? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: