గోదావరి జిల్లాల ఫైనల్ సర్వే రిపోర్ట్..? ఎవరికి ఎన్ని సీట్లు..?

Chakravarthi Kalyan

గోదావరి జిల్లాలు.. ఈ జిల్లాలు ఎటు మొగ్గితే రాష్ట్ర రాజకీయం అటువైపు మొగ్గటం ఖాయమని చరిత్ర  చెబుతోంది. ఈ రెండు జిల్లాలు కలిపి 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లు, పశ్చిమ గోదావరిలో 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

 

ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేన మూడు కూడా ప్రభావితం చూపించే ప్రాంతం కూడా ఇదే. గత ఎన్నికల్లో ఈ జిల్లాల్లో టీడీపీ సత్తా చాటింది. అధికారం చేజిక్కుంచుకుంది. మరి ఈసారి గోదావరి జిల్లాల్లో జయకేతనం ఎవరిదన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. దీనిపై ఓ సర్వే సంస్థ తన ఫలితాలు విడుదల చేసింది.

 



ఈ సర్వే ప్రకారం.. అధికార తెలుగుదేశానికి ఈసారి ఎదురుగాలి వీస్తోంది. మొత్తం 34 స్థానాల్లో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే ఈ పార్టీ మొదటి స్థానంలో ఉంది. మరో 9 స్థానాల్లో రెండో పొజిషన్‌లో ఉంది. 22 స్థానాల్లో మూడో స్థానంలో ఉంది. అంటే ఈ రెండు జిల్లాల్లో టీడీపీ కనిష్టంగా 2, గరిష్టంగా 12 స్థానాలు గెలిచే అవకాశం ఉంది.



ప్రతిపక్ష వైసీపీ విషయానికి వస్తే.. ఈ పార్టీ 16 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. మరో 11 స్థానాల్లో సెకండ్ పొజిషన్‌లో ఉంది. మరో 7 స్థానాల్లో మూడో స్థానంలో ఉంది. అంటే వైసీపీ కనిష్టంగా 16 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. గరిష్టంగా 27 స్థానాల్లో నెగ్గే ఛాన్స్  ఉంది.



ఇక జనసేన విషయానికి వస్తే.. రాష్ట్రం మొత్తం మీద గోదావరి జిల్లాల్లోనే ఈ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో కలిపి జనసేన 15 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్‌ లో ఉంది. మరో 10 స్థానాల్లో సెకండ్ పొజిషన్‌లో ఉంది. 9 స్థానాల్లో మూడో స్థానంలో ఉంది. అంటే కనిష్టంగా 15 స్థానాల్లోనూ..గరిష్టంగా 25 స్థానాల్లోనూ గెలిచే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకూ ఫస్ట్ పొజిషన్‌ లో ఉన్నవాళ్లే ఎన్నికల్లో గెలిస్తే.. రెండు జిల్లాలో కలిపి టీడీపీ 3 స్థానాలు, వైసీపీ 16 స్థానాలు, జనసేన 15 స్థానాలు గెలుచుకుంటాయని ఈ సర్వే చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: