ఈ వారం విడుదలకి రెడీగా ఉన్న మూవీలు ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.
ఆ ఒక్కటి అడక్కు : అల్లరి నరేష్ హీరోగా ఫెరియా అబ్దుల్లా హీరోయిన్ గా మళ్లీ అంకం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ తో అల్లరి నరేష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ప్రసన్న వదనం : రైటర్ పద్మభూషణ్ , అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి రెండు వరస విజయాల తర్వాత సుహాస్ హీరో గా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో సుహద్ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
శబరి : వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది.
బాక్ : మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమనులు అయినటువంటి తమన్నా , రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన బాక్ అనే హారర్ సినిమా మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించాడు. తమిళ్ లో "అరుణ్మనై 4" అనే పేరుతో రూపొందిన ఈ సినిమా తెలుగులో బాక్ టైటిల్ తో విడుదల కానుంది. ఈ మూవీ తమిళ్ లో కూడా మే 3 వ తేదీనే విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: