వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ: ఈరోజు నుంచి నిలిపివేత.. కారణం ఇదే..!

Divya
ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి ఆరోగ్య సేవలకు సడన్గా బ్రేక్ పడింది.. ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎంతో మంది ప్రజలకు ఉచితంగానే  చికిత్స చేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చికిత్స చేయించుకున్న బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదని అందువల్లనే మే 22 నుంచి ఆరోగ్య సేవలు కూడా నిలిపివేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ సంస్ధ తెలియజేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి సోమవారం రోజున ఒక లేఖ ద్వారా కూడా తెలియజేశారు.

దాదాపుగా గత ఏడాది ఆగస్టు నుంచి అందుకు సంబంధించిన బిల్లులను కూడా చెల్లింప చేయలేదని అందుచేతన నిలిపివేయబోతున్నట్లు తెలియజేశారు. సుమారుగా రూ .1500 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని తప్పని పరిస్థితులలో తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఈ లేఖలు తెలియజేశారు. సుమారుగా రూ .530 కోట్లకు పైగా విలువైన బిల్లులను సైతం CFMS లో అప్లోడ్ చేసినట్లుగా ఈనెల రెండవ తేదీన సీఈవో తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన వాటిని చెల్లించ లేకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను కూడా నిలిపివేయాలని తెలియజేస్తున్నారు.

కేవలం ఉద్యోగుల ఆరోగ్య పథకం కిందరూ .50 కోట్ల రూపాయల బిల్లును మాత్రమే చెల్లింప చేశారని లేఖలో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్  ఆశ తెలియజేసింది. ప్రభుత్వం ఆరోగ్య శ్రీ డబ్బులను చెల్లించకపోవడంతో ఈనెల ప్రారంభంలోనే నెట్వర్క్ ఆసుపత్రులు ఎన్నోసార్లు లేఖలు కూడా రాశాయని సర్కార్ కి తెలియజేశారు.. మే 4వ తేదీ నాటికి బకాయిలు చెల్లించకుంటే నగదు రహిత చికిత్సలను కూడా ఆపివేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ విషయం నుంచి ప్రభుత్వం నుంచి ఏ విధంగా స్పందన రాకపోవడంతో ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ ,ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలను నిలిపివేయబోతున్నట్లు తాజాగా ఆశ తెలియజేసింది. దీంతో పేద ప్రజలకు ఇది మరింత భారంగా మారుతుంది. మరి వీటి పైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: