మోదీ, బాబు, పవన్‌ కలిసినా.. నాకు 151 పక్కా అని జగన్‌ చెబుతున్నది ఇందుకేనా?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. ఓటర్లు తమ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్ 4 పోలింగ్ అధికారులు తుది తీర్పు వెల్లడిస్తారు. అయితే గతంలో లేనంతగా ఈ సారి పోలింగ్ శాతం రికార్డులను నమోదు చేయడంతో ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టం అయిందని టీడీపీ కూటమి.. లేదు లేదు అదంతా ప్రభుత్వ పాజిటివ్ ఓటు బ్యాంకు అని అధికార వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఎవరి లెక్కలు వారికున్నా.. నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఏంటనే దానిపై లోతుగా చర్చ సాగుతోంది. ఆయా పార్టీ అభ్యర్థులు ఓటింగ్ సరళిపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తమకు పడే ఓట్లు, వచ్చే సీట్లపై ఆయా పార్టీల నేతలు అంచనా వేసుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత సీఎం జగన్ వచ్చి గతంలో వచ్చిన 151సీట్లను మించి ఈ సారి కొడుతున్నాం అని ప్రకటించడంతోనే వచ్చింది గందరగోళమంతా..

జగన్ ఏ ధైర్యంతో ఈ మాటలు చెబుతున్నారు. నిజంగానే అన్ని సీట్లు వస్తాయా? పైగా ఈ సారి ఎన్నికల్లో ఓటర్ నాడి కూడా దొరకడం లేదు. క్షేత్ర స్థాయిలో టఫ్ ఫైట్ నడిచిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఇలాంటి ప్రకటన చేయడం ఆ పార్టీ నేతలను సైతం విస్మయానికి గురి చేసింది.

వారు వేసుకున్న అంచనాలు పరిశీలిస్తే గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. 70 శాతం ఓట్లు తమకే పడ్డాయి. సచివాలయ ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు తమకే ఓటేశారు. మొత్తం ఇతర ఉద్యోగులతో కలుపుకొంటే ఈ సంఖ్య 50 లక్షల వరకు చేరుతుంది. ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ తమకే పడ్డాయని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. ఇదే సందర్భంలో మహిళలు, లబ్ధిదారులు 1.45 కోట్ల కుటుంబాలలో ఇంటికి ఒక ఓటు వేసుకున్నా కనీసం 1.45 కోట్లు తమకే పడతాయి. వీటితో పాటు మైనార్టీ ఓట్లను లెక్కేసుకుంటే రెండు కోట్ల వరకు చేరతాయి. దీంతో మా విజయం ఖాయం అనే లెక్కలు వైసీపీ వర్గాలు వేసుకుంటున్నాయి. 151 కాకపోయినా.. 120 వరకూ ఖాయమని ఆ  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: