ప్రశాంత్ వర్మ - రణవీర్ మూవీకి.. పవర్ ఫుల్ టైటిల్?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది కొత్త దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా నేటితరంలో మాత్రం తన సినిమాలతో స్పెషల్  ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి నుంచి అందరిలా రొటీన్ కథలను కాకుండా విభిన్నమైన స్టోరీలను ఎంచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు.

 ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకేక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అన్ని సినిమాలు కూడా.. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినవే అయితే ఈ ఏడాది తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్ మూవీ ఎంత సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ మూవీతో ప్రశాంత్ వర్మ టాలెంట్ ఏంటో ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తెలిసింది. హనుమాన్ సూపర్ హిట్ తర్వాత జై హనుమాన్ అనే మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు ప్రశాంత్ వర్మ. కానీ ప్రస్తుతం ఈ మూవీ ని పక్కన పెట్టేసాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

 బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో సినిమా తీసేందుకు ఛాన్స్ రావడంతో జై హనుమాన్ మూవీ ని పక్కన పెట్టాడని ఇక రణవీర్ తో మూవీ పూర్తయిన తర్వాత మళ్లీ జై హనుమాన్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి రాక్షస్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో ఒక టాక్ చక్కర్లు కొడుతుంది. ఇందులో రణబీర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. మైతలాజికల్ బ్యాక్ డ్రాప్ తో స్వాతంత్రానికి ముందు జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: