వాడు మంచోడు కాదు.. చనిపోయే ముందు భార్యపై ఉదయ్ కిరణ్ సంచలన లేఖ.!

Pandrala Sravanthi
ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరొందిన ఉదయ్ కిరణ్ మరణం ఎంతో మందిని బాధ పెట్టింది. ఆయన చనిపోయిన కూడా ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో బతికే ఉన్నారు. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఆ సినిమాలు ఉదయ్ కిరణ్ ని ఎప్పటికీ ప్రేక్షకుల మదుల్లో బతికే ఉంచుతాయి.అయితే అలాంటి ఉదయ్ కిరణ్ చనిపోయిన సమయంలో ఎన్నో గాసిప్స్ వైరల్ అయ్యాయి.ముఖ్యంగా మెగా ఫ్యామిలీ వల్లే ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నారని కొంతమంది అంటే, ఇంకొంతమందేమో ఉదయ్ కిరణ్ భార్య విషిత చేసిన పని వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటూ ఉంటారు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ప్రధాన కారణం మాత్రం సినిమాల్లో అవకాశాలు లేకపోవడం.. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు వచ్చిన సినిమాలు కూడా అంత హిట్ కాకపోవడంతో చేతినిండా సినిమాలతో మంచి హిట్స్ కొట్టిన పరిస్థితి అలా ఉండడంతో డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నారని చాలామంది ఆయన దగ్గర సన్నిహితులు అంటున్నారు. 


ఇదంత పక్కన పెడితే  చనిపోయే ముందు ఆయన భార్య విషిత గురించి ఉదయ్ కిరణ్ రాసిన లేఖ అంటూ గతంలో ఒక లెటర్ తెగ చక్కర్లు కొట్టింది. ఆ లెటర్లో ఏముందంటే..విషిత అతను మంచోడు కాదు అంటూ చెప్పిన ఒక పాయింట్ మాత్రం తెగ వైరల్ అయింది. ఇక ఆ లెటర్ లో ఏముందంటే.. విషిత.. మా అమ్మ అంటే ఎంత ఇష్టమో నువ్వంటే కూడా అంతే ఇష్టం.. మనిద్దరి మధ్య ఉన్న గొడవల వల్ల మిగతా వాళ్ళు బాధపడుతున్నారు. అంకుల్ ఆంటీ కూడా సఫర్ అవుతున్నారు. నువ్వు అతను మంచివాడు అనుకుంటున్నావు. కానీ అతను మంచివాడు కాదు. అతడు మంచివాడు కాదు అని నీకు తెలిసే సమయానికి నీ పక్కన నేను ఉండను. మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం.ఆమె నీకు ప్రేమతో ఇచ్చిన నగలు మా అక్కకు ఇవ్వు. ఆ నగల్ని అక్క జాగ్రత్తగా దాచుకుంటుంది.


నాకు ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు, ఛీతరారింపులు ఎదురయ్యాయి. దానివల్ల నేను ఎంతో సఫర్ అవుతున్నాను. నువ్వు ఒకసారి అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకో. ఇండస్ట్రీలో నన్ను ఓ పిచ్చివాడిని చేశారు. మన గొడవల వల్ల చాలామంది బాధపడుతున్నారు. అందుకే అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మా నిన్ను కౌగిలించుకొని ఏడవాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అంటూ ఆ లెటర్ లో ఉంది. అయితే ఆ లెటర్లో ఉన్న మ్యాటర్ ఎంత నిజమో తెలియదు కానీ గతంలో ఉదయ్ కిరణ్ మరణించిన సమయంలో  చాలా వైరల్ అయింది. దాంతో చాలామంది నెటిజన్లు ఉదయ్ కిరణ్ భార్య కారణంగానే మరణించారని అనుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: