వరుణ్ సందేశ్..హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో యూత్ ఫేవరెట్ హీరోగా..లవర్ బాయ్ గా.. మారిపోయిన ఈయన ఎన్నో సినిమాలతో అభిమానులని అలరించారు. అలా ఒకప్పుడు హిట్ సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం అంత మంచి సినిమాలు ఏమీ చేయడం లేదు. అవకాశాలు కూడా ఎక్కువగా రావడం లేదు. ఇండస్ట్రీలో ఆయనకు వచ్చిన స్టార్డంని కాపాడుకోలేక పోయారు. ఈయన చేసిన చాలా వరకు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో చివరికి సినిమాల్లో ఆఫర్స్ కూడా రాలేవు. దాంతో చాలా రోజులు సినిమాలు లేక ఇంటిపట్టునే ఉన్నారు. ఇక తెలుగు బిగ్ బాస్ షోలో కూడా వితికతో కలిసి వచ్చి హౌస్ లో తన పర్ఫామెన్స్ తో మళ్లీ ఇండస్ట్రీలో కంబ్యాక్ అయ్యి బిగ్ బాస్ తర్వాత ఆఫర్స్ అందుకున్నారు.అయితే అలాంటి వరుణ్ సందేశ్ నటి వితికాను పెళ్లి చేసుకున్నారు.
అయితే వీరి పెళ్లై ఇప్పటికి 9 ఏళ్లయినా కూడా ఇప్పటికీ పిల్లలు లేరు. దాంతో చాలామంది ఇండస్ట్రీ జనాలతో పాటు ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, సన్నిహితులు, ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్కరు కూడా పెళ్లయి తొమ్మిదేళ్లయింది..పిల్లలు పుట్టడం లేదేంటి అని అడుగుతారట. అయితే చాలా సందర్భాలలో పిల్లలు ప్లాన్ చేయలేదా అని ఎంతోమంది అడిగి ఈ జంటను అడిగి అడిగి విసిగిపోయారట. దాంతో అసలు పిల్లల గురించి అడగడమే మానేశారట.అయితే 9 ఏళ్లయినా పిల్లలు పుట్టక పోవడానికి కారణం గురించి వరుణ్ సందేశ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాకు పెళ్లయి 9 ఏళ్ళు అయింది..అయితే గత మూడు సంవత్సరాల క్రితం వితికాకు ప్రెగ్నెన్సీ అయి మిస్ క్యారేజ్ అయింది. దానివల్ల వితిక చాలా బాధపడింది.ఆ బాధనుండి బయటపడడానికి చాలా రోజుల సమయం పట్టింది. అయితే ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేదు.
దానికి కారణం అప్పుడే వితిక యూట్యూబ్ ఛానల్ పెట్టింది.ఆ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యాక ఆ యూట్యూబ్ వల్ల వచ్చిన డబ్బుతోనే సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉందని వితిక చెప్పింది.అందులో ఒక్క రూపాయి కూడా తనని పెట్టకోకూడదని, మొత్తం నేను సంపాదించిన డబ్బుతోనే ఇల్లు కట్టుకుంటానని.. అది నా డ్రీమ్ అని వితిక చెప్పింది.దాంతో వితికా డ్రీమ్ ఫుల్ ఫీల్ అయింది.ఈ మధ్యనే కొత్త ఇల్లు కట్టుకున్నాం.అయితే మాకు ఇప్పటికే ఓ ఇల్లు ఉన్నప్పటికీ వితికా కోరిక ప్రకారం తన సొంత డబ్బులతో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం కూడా చేశాం. ఇక మిగిలింది పిల్లలే.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతాం. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లోనే ఉన్నాం అంటూ వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.