జగన్‌: అలా ఎందుకు చేశాడు? అంతబట్టని అంతరంగం?

frame జగన్‌: అలా ఎందుకు చేశాడు? అంతబట్టని అంతరంగం?

Chakravarthi Kalyan
గత మ్యానిఫెస్టోలో ప్రకటించినవి 99శాతం అమలు చేశారన్నది వైసీపీ నేతల నుంచి వినిపించే మాట. జగన్ చేసిందే చెబుతారు.. చెప్పిందే చేస్తారు అని తరచూ చెబుతుంటారు. దీంతో ఈ మ్యానిఫెస్టోపై సామాన్య జనాలతో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే సహజంగానే జగన్ నుంచి సంక్షేమాన్ని ఆశిస్తారు. కానీ గత మ్యానిఫెస్టోకి కొంత కేటాయింపులు పెంచి.. చిన్న చిన్న మార్పులతో మ్యానిఫెస్టో ప్రకటించారు.

అయితే భారీ కేటాయింపులు లేకపోవడం, గత మ్యానిఫెస్టోలో చేర్చి అమలు చేయకపోయిన వాటి గురించి జగన్ ఎటువంటి ప్రస్తావన చేయలేదు. పైగా డ్వాక్రా, వ్యవసాయ రుణాల మాఫీ వంటి విషయాల జోలికి అస్సలు పోలేదు. పింఛన్ల పెంపు కూడా ఆఖరి రెండు సంవత్సరాలు అది కూడా  ఏడాదికి రూ.250 పెంచుతానని చెప్పారు. అయితే టీడీపీ సూపర్ సిక్స్ తో పోల్చి చూసినప్పుడు ఇది ఏపీ ప్రజలకు అంత రుచించదు.

మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టి వస్తున్నా.. మ్యానిఫెస్టో సాధారణంగా ఉన్నా కూడా జగన్ ధైర్యం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. వాస్తవానికి టీడీపీ మ్యానిఫెస్టో విడుదల తర్వాత వైసీపీ ది ఉంటుందని అంతా భావించారు. కానీ జగన్ సింపుల్ గా రెండు పేజీలతో మ్యానిఫెస్టో ప్రకటించేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.

వాస్తవానికి తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కి మించి జగన్ హామీలు గుప్పిస్తారు అని టీడీపీ నేతలు భావించారు. కానీ జగన్ వారికి షాక్ ఇచ్చారు. తన మాటను జనం నమ్ముతారు అని ధీమానా లేక.. చంద్రబాబు హామీలను నమ్మరు అనే ధైర్యమా ఏంటో అర్థం కావడం లేదు. వాస్తవానికి మ్యానిఫెస్టో రూపకల్పనలో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో ప్రజల్లో అంచనాలు పెరిగాయి. కానీ వాటిని అందుకోవడంలో జగన్ విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. మరీ వీటన్నింటిని దాటుకొని జగన్ ఏ మేర రాణిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: