రామ్ చరణ్ నటనతో సర్ప్రైజ్ అయిన శంకర్..?

MADDIBOINA AJAY KUMAR
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో సినిమా లలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన విషయం మన అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం మూవీ లో చిట్టి బాబు పాత్ర లో తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను , విమర్శకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకున్నాడు . ఆ మూవీ కంటే ముందు నటన విషయంలో కాస్త విమర్శలను ఎదుర్కొన్న చరణ్ ఈ సినిమాలో తన నటనతో విమర్శకులు సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు.

ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ లో కూడా తన నట విశ్వ రూపాన్ని చూపించాడు . ఇందులోని ఒక్కో సన్నివేశం లో రామ్ చరణ్ ఒక్కో రకమైన ఎక్స్ప్రెషన్ చూపిస్తూ నటనలో పీక్స్ కి చేరిపోయాడు. ఇలా తన నటన తో ఈ మధ్య కాలంలో విశ్వ రూపాన్ని చూపిస్తున్న చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇక శంకర్ సినిమాలో పాత్రలు అద్భుతంగా ఉంటాయి.

అలాగే అందులో నటన కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇక గేమ్ చెంజర్ సినిమాలో ఈయన తండ్రి గాను , కొడుకు గానూ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ రెండింటిలో చరణ్ తండ్రి పాత్ర చేసినప్పుడు శంకర్ అందులో చరణ్ నటనకు షాక్ అయినట్లు , ఆ స్థాయి పర్ఫామెన్స్ ను చరణ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న గేమ్ చేంజర్ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: