టిఆర్ఎస్ పార్టీ పై సంచలన కామెంట్స్ చేసిన ఏపీ మంత్రి..!

KSK
2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దుర్వినియోగ పరిచిందని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సంచలన కామెంట్ చేశారు. నిజంగా మీపై ప్రజలకు నమ్మకం ఉంటే ఎందుకు ఇంత కుట్రలకు కుతంత్రాలకు పాల్పడున్నారని ప్రశ్నించారరు.


టీఆర్‌ఎస్‌, వైసీపీ కలిసి తెలుగుదేశంపార్టీ అధికార డేటాను దొంగలించి వైసీపీకి ఇచ్చారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఇన్ని కుట్రలు చేయడానికి ఏమి అవసరం ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.



కేటీఆర్‌, జగన్‌ లోటస్‌పాండ్‌లో కలిసి కుట్రలు చేయడానికి సమాలోచనలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి కుట్రలు తెలుగుదేశంపార్టీపై గతంలో అనేకం జరిగాయని గుర్తు చేశారు. 1984, ఆగస్టు అక్రమంగా ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించివేసిన సమయంలో రాష్ట్రమంతట ఒక్కటై ప్రజాస్వామ్యన్ని రక్షించుకుందన్నారు.


మళ్లీ ఇవాళ ప్రజాస్వామ్యంను రక్షించుకోవాటానికి ప్రజలంత ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశంపార్టీ సానుభూతి ఓట్లలను, మేము నియమించుకున్న చరుకైన బూత్‌ కన్వీనర్‌ ఓట్లలను తోలగించారని ఆయన ఆరోపించారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా లీకేజ్ కేసు తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఎన్నికల ముందు ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: