పవన్ అభిమానుల ఎత్తుగడలో రజనీకాంత్ పై టార్గెట్ !

Seetha Sailaja
‘అజ్ఞాతవాసి’ మూవీ తరువాత పవన్ రాజకీయాల బాటపట్టి అక్కడ సందడి చేస్తున్నా, వస్తున్న సర్వేలు ఏమాత్రం పవన్ కు ఆశాజనకంగా లేకపోవడంతో పవన్ సినిమాలను వదులుకుని తప్పు చేసాడా అంటూ పవన్ వీరాభిమానులు అంతర్మధనంలో ఉన్నట్లు టాక్. అయితే పవన్ తో పాటు ప్రస్తుతం రాజకీయ రంగంలో కొనసాగుతున్న రజినీకాంత్ కమలహాసన్ లు సినిమాలు చేస్తూ తమరాజకీయాలను కొనసాగిస్తున్న నేపధ్యంలో అలా రెండుపడవల ప్రయాణం చేయకుండా తమ హీరో తనకేరియర్ కు సంబంధించి త్యాగాలు చేసిన నిజమైన హీరో అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు మరో కొత్త స్లోగన్ కు తెర లేపారు.

దీనికితోడు పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటే మాస్ లో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ తాను రాబోతున్న ఎన్నికలలో పోటీ చేయడంలేదని ప్రకటించడం రజినీ అభిమానులకు తీవ్రనిరాశను కలిగించిన విషయం తెలిసిందే. అయితే పవన్ అభిమానులు మాత్రం రజినీకాంత్ ను ఉదాహరణగా చూపెడుతూ గెలుపు ఓటమిల గురించి ఆలోచించని వాడే నాయకుడు అంటూ అటువంటి లక్షణాలు తమ హీరోకి మాత్రమే ఉన్నాయని పవన్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు.

అంతేకాదు ఎన్నికలలో ఓటమికి భయపడి అటువంటి ప్రయత్నమే చేయనివాడు పిరికివాడు మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడుగా ఆశలు ఎదగలేడని అయితే ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా ఎన్నికలలో ఓడినా తాను జనం మధ్యనే ఉంటాను అంటూ చెపుతున్న పవన్ ఆలోచనల ముందు రజనీకాంత్ ఇమేజ్ ఏమాత్రం సరిపోదు అంటూ పవన్ అభిమానులు మరొక సరికొత్త అర్ధాన్ని వెతుకుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యత లేకపోయినా మరొక ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడు గురించి ప్రజలు ఎదురు చూడకపోయినా ధైర్యంగా ప్రజా క్షేత్రంలో తన విధానాలు వివరిస్తూ జనం మధ్య తిరుగుతున్న పవన్ కళ్యాణ్ సాహసం మరి ఏహీరో చేయలేరు అంటూ పవర్ స్టార్ అభిమానులు తమ హీరో పై ప్రసంసలు కురిపిస్తూ మరొకవైపు రజినీకాంత్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

వాస్తవానికి తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు రజినీకాంత్ కు ఎటువంటి సంబంధం లేదు. అయితే రజనీకాంత్ రాజకీయాలలోకి వచ్చేసాను అంటూ ప్రకటన ఇచ్చి కూడ వరసగా సినిమాలు చేస్తున్న నేపధ్యంలో అలాంటి వ్యూహాలు తమ హీరో చేయలేకపోతున్నాడు అన్న స్పష్టమైన బాధ పవన్ అభిమానుల కామెంట్స్ లో కనిపిస్తోంది. అయితే కేవలం ఒక హీరో రాజకీయాలలో రాణించాలి అంటే అభిమానుల ప్రోత్సాహమే కాకుండా సామాన్య ఓటర్ల హృదయాలకు చేరువయ్యే విధంగా ఆవ్యక్తి వ్యూహాలు ఉండాలి. అయితే ఈవిషయంలో పవన్ పొలిటికల్ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో అసహనంతో పవన్ అభిమానులు ఇలా రజినీకాంత్ ను టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: