30 కుటుంబాలకు 500 రూపాయలు.., బాబుని అసహ్యించుకున్న పవన్ !

KSK
తిత్లి తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో చాలా వరకు పంట పొలాలు నష్టపోయాయి..తుఫాను వల్ల చాలా మంది నిరాశ్రయులయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పనిలో యంత్రాంగం మొత్తం అక్కడ పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే తుఫాన్ వల్ల చాలామంది ప్రజలు తీవ్రంగా నష్టపోవడం తో సమాజంలో ఉండే ప్రముఖులు సినిమా నటులు మరియు రాజకీయ నాయకులు వారికి తోచిన సాయం అందిస్తూ ప్రజలను ఆదుకుంటున్నారు.


ఇదే క్రమంలో తుఫాను ప్రభావం అడ్డుపెట్టుకొని నీచాతి నీచమైన రాజకీయాలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అది చేశాం ఇది చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న టిడిపి నాయకులకు దిమ్మ తిరిగే విధంగా ఒక షాకింగ్ వార్త బయటకు వచ్చింది.


అదేమిటంటే తాజాగా ఇటీవల తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు పవన్. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలు చంద్రబాబు వచ్చి ఏం చేశారో చెప్పగా పవన్ షాక్ కి గురయ్యారు.అక్కడ దాదాపు ముప్పై కుటుంబాలు తినడానికి తిండి సరైన అవసరాలకు సరుకులు లేక ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు కేవలం 500 రూపాయలు ఇచ్చి వారిని కూరగాయలు కొనుక్కోమన్నారని బాధితులు పవన్ దగ్గర వాపోయారు.


కనీసం ఒక్కో కుటుంబానికి 500 కాకుండా 30 కుటుంబాలకి కలిపి 500 ఇస్తే ఏం చేసుకోవాలని ఆ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ తతంగం మొత్తం విన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులకు నేను మద్దతు ఇచ్చానా? అని పవన్ కళ్యాణ్ తన పట్ల తాను అసహ్యించుకున్నట్లు అక్కడున్న కొంతమంది పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: