పొడుగైన శిరోజాల కోసం ఈ కూరగాయలు తినండి..!?

Chakravarthi Kalyan
ఓ వ్యక్తి అందాన్ని ఇనుమడింపజేసే అంశాల్లో కురులకు చాలా ప్రాధాన్యం ఉంది. అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు మనిషిలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. అదే పొట్టి జుట్టు, పీల జుట్టు, బట్టతల వంటివి మనిషిని ఆత్మన్యూనతకు గురి చేస్తాయి. మరి అందమైన కురులు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదు.


అందుకే ఆరోగ్యవంతమైన కురుల కోసం కొన్ని కూరగాయలు ఎంపిక చేసుకుని క్రమం తప్పకుండా తీసుకోవాల్సిఉంటుంది. మరి జట్టుకు బలాన్నిచ్చే ఆ కూరగాయలేంటో చూద్దాం.. పీచు పదార్థం ఎక్కువగా ఉండే పాలకూర ఐరన్, జింక్ లను అందించి జుట్టుకు మంచి బలాన్నిస్తుంది. ఈ రెండు సమపాళ్లలో అందకపోతే జుట్టు క్రమంగా రాలిపోతుంటుంది. 


విటమిన్ బీ7 ఎక్కువగా లభించే క్యారట్ కూడా జట్టును ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఇందులోని బయోటిన్ జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది. క్యారట్లను ఉడికించి  పేస్టుగా చేసి తలకు పట్టించడం ద్వారా జట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఈ ప్రయోగం శిరోజాల పెరుగుదలకు కూడా కారణమవుతుంది. ఉల్లి పాయలు కూడా జట్టు ఎదిగేందుకు తోడ్పడతాయి.


బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే చిలకడ దుంపలు కూడా జట్టు ఎదుగుదలకు తోడ్పడతాయి. టామాటాలు కూడా జట్టు ఆరోగ్యానికి సహకరిస్తాయట. టమాటాలను నేరుగా తిన్నా.. లేక టమాటా గుజ్జును తలకు పట్టించినా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వెల్లుల్లి సైతం జట్టుకు మేలు చేస్తుందట. వాసన ఘాటుగా ఉన్నా ఇది జుట్టుకు టానిక్ లాగా పనిచేస్తుందట. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: