టిడిపి పై మోడీ మార్క్ అటాక్ మొదలైందా?

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) కి ఒక నమస్కారం పెట్తి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీకి దాని అధినేతకు కేంద్రం నుండి ఎదురుదాడి మొదలైనట్లే. బయటకు వచ్చిన టిడిపి కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం, వెనువెంటనే కేంద్రం కూడా ఎదురుదాడి మొదలైన దాఖలాలు కన్ ఇపిస్తున్నాయి. పార్ల మెంట్ నుండే కేటగోరికల్ గా సమాధానాలు చెప్పటం మొదలెట్టారు. మున్ముందు చాలా రహస్యాలు బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం లేవనెత్తుతున్న అంశాలకు సమాధానం చెప్పకుండా, సరికొత్త విషయాలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాజకీయ యవనికపైకి తీసుకొచ్చారు. 

"ఆంధ్రప్రదేశ్‌కు హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఈ ప్యాకేజీని ఇచ్చే విధానంపై రాష్ట్ర ప్రభుత్వమే మాకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది" అని అరుణ్ జైట్లీ నిన్న శుక్రవారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యులో చెప్పారు. 


"మేము ఒక పరిష్కారాన్ని చూపించాం. అందుకు అనుగుణంగా నిధులు కావాలో? లేక వివాదం రగిలించాలో? టిడిపి ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి" అని కొంత హెచ్చరిక మరి కొంత కవ్వింపు ధోరణితో కూడిన స్వరంతో చెప్పారు. టిడిపి అధినేత కోరికపైనే 2016 సెప్టెంబరులోనే ప్యాకేజీపై విధివిధానాల రూపకల్పన జరిగిందని, కానీ నిధులు మరో రూపంలో కావాలని ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేసిందని జైట్లీ చెప్పారు. అందుకు కేంద్రం అంగీరించినప్పటికీ, ఏపీ నుంచి సరైన ప్రతిస్పందన లభించలేదు" అని చెప్పారు. 

ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఎంపివి ఫార్ములా విధానంలో నాబార్డు ద్వారా నిధులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మళ్లించేందుకు కేంద్రం అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర స్థాయిలో వివరంగా చర్చించి మళ్లీ వస్తామని ఫిబ్రవరి 7న ఏపీ అధికారులు వెనక్కి వెళ్లారని, అలావెళ్ళిన వాళ్ళు సమాధానం తో ఇంకా తిరిగి రాలేదని అన్నారు. "వారు వస్తారని మేము ఎదుచూస్తున్నాం" అని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇక్కడ తప్పు టిడిపిదే. ప్రత్యేక పాకేజి అనే ఒక జడపదార్ధాన్ని కోరింది తెలుగుదేశమే కదా! 

కేంద్రమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో రాజ్యసభలో వివరిస్తున్న సుజనాచౌదరిని పదేపదే అడ్డుకున్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, సభ నుంచి బయట కొచ్చి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో చెబుతూ అనేక ట్వీట్లు పెట్టారు. 

అందులో కొన్ని లెక్కలు వెల్లడించారు. "ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు, వాస్తవాలు అబద్ధాలు చెప్పవు" అంటూ నిధుల వివరాలు పేర్కొన్నారు. విభజనచట్టం ప్రకారం ఏపీకి చేసిన సాయం కింద 2014-15లో వనరులలోటును రూ.3,979.50 కోట్లగా పేర్కొన్నారు. 

రెవెన్యూ లోటును ₹ 27,138.83 కోట్లగానూ, ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ₹ 1,050 కోట్లు, రాజధానికి ₹ 2,500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు ₹ 5,364 కోట్లగా ప్రస్తావించారు. ప్రపంచ బ్యాంకు, వివిధ ఆర్థికసంస్థల నుంచి అందుతున్న సాయంపై లెక్కలు వివరించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించి తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను సమగ్రంగా పరిశీలిస్తున్నామని కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి రాజెన్‌ గోహైన్‌ వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఇలా చూస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో తమ రాష్ట్రానికి కావలసిన డిమ్మాండ్ ఎలాగైతే పెట్టలేకపోయిందో అలాగే చట్టపరంగా అర్హతలేని ప్రత్యేక హోదా రాకపోగా - ఇప్పుడు కేంద్రం ఇస్తానన్న ప్రత్యెక పాకేజీ కూడా కోల్పోయి రెంటికి చెడ్డ రేవడి అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: