రిజర్వేషన్లపై.. రేవంత్ కు కౌంటర్ ఇచ్చిన మోడి?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో అన్ని పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మరోసారి గెలిస్తే ఇక అభివృద్ధి కుంటుపడుతుంది అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే.. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత ప్రభుత్వాలు చేసి చూపించలేదు అంటూ ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ గొప్పలు చెప్పుకుంటుంది. ఇలా ఎవరికి వారు ఓటరు మహాశయులను  ఆకట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి.

 2025 వరకు ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు అవుతుందని ఈలోగా భారత్ను రిజర్వేషన్ రహితంగా హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ ఎప్పుడో నిర్ణయించుకుంది అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక దీనికోసమే బిజెపి ప్రయత్నాలు చేస్తుందని విమర్శలు గుప్పించారు. 400 లోక్సభ స్థానాల్లో గెలిచి ఎవరికి రిజర్వేషన్లు లేకుండా రద్దు చేయాలని బిజెపి కుట్ర చేస్తుంది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారిపోయాయి. అయితే ఈ విషయం బిజెపిలో ఉన్న కీలక నేతలందరికీ తెలుసు. అని అందుకే వారు రిజర్వేషన్ల గురించి పెద్దగా మాట్లాడటం లేదు అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందేందుకే బిజెపి ప్రయత్నిస్తున్నట్టు విమర్శించారు.

 అయితే ఇలా సీఎం రేవంత్ బిజెపిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారో లేదో అంతలోనే ఇక అటు నరేంద్ర మోడీ ప్రసంగంలో చెప్పిన మాటలు సంచలనంగా మారిపోయాయి . మతపరమైన రిజర్వేషన్ల కారణంగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలు లాంటి అనగారిన వర్గాలకు రిజర్వేషన్ల కారణంగా తగిన న్యాయం జరగడం లేదు. రిజర్వేషన్లు అనేవి మతపరంగా ఉంటే అసలు అంగీకరించే ప్రసక్తి లేదు అంటూ మోడీ తేల్చి చెప్పారు. ఒకరకంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని.. వారి కోసమే రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు ఉంటాయని తేల్చి చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా రేవంత్ పూర్తిగా రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలకు మోడీ కౌంటర్ ఇచ్చారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: