జగన్‌: తోడేళ్ల గుంపు విరుచుకుపడ్డా.. సునామీలా చుట్టేసిన ఒకే ఒక్కడు?

Chakravarthi Kalyan
ఇంకొన్ని గంటల్లో ఏపీలో పోలింగ్‌ జరగబోతోంది. అభ్యర్థుల్లో ఒక్కొక్కరిలో భయం మొదలవుతుంది. దాదాపు ఏపీలో ఇంత సుదీర్ఘంపాటు ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది.  మే 13న పోలింగ్. అది కూడా నాలుగో విడతలో. దీంతో రెండు నెలల పాటు ప్రచారాన్ని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అధికార పార్టీ చేసింది చెప్పుకోవడానికే మంచిదే అయినా.. ఖర్చులకు వెనకాడకుండా క్యాడర్ ను రోజూ సమన్వయం చేయడం అంటే మామూలు విషయం కాదు.

ఇక వైసీపీ ప్రచార సరళిని చూసుకుంటే ఈ ఎన్నికల్లో సింగిల్ గా బరిలో నిలిచారు సీఎం జగన్. ప్రత్యర్థి పార్టీలు మూడు కలిసి కూటమిగా వచ్చినా ఏ మాత్రం బెదరకుండా ధైర్యంగా పోరాడారు. మూడు పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలను ఒక్కడే ఒంటరిగా తిప్పికొట్టారు. తన సర్వం ధారపోశారు. ఒక్కమాటలో చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేశారు. మండటెండలను సైతం లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించారు.

పార్టీ విజయం కోసం అన్ని నియోజకవర్గాలను చుట్టేశారు.  సిద్ధం సభలతో ట్రెండ్ క్రియేట్ చేసి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించిన సీఎం.. ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. ఓ పక్కన కుటుంబ సభ్యులే తన ప్రత్యర్థులతో చేతులు కలిపి తనను ఇరుకున పెట్టాలని చూసినా.. ఇదే  అంశాన్ని చంద్రబాబు తీసుకొని పదేపదే విమర్శించినా.. కూడా ఏమాత్రం బెదిరిపోకుండా మొండిగా నిలబడ్డారు.

అనునిత్యం ప్రజలతో మమేకం అవుతూ.. తాను చేసిన సంక్షేమ పథకాలను వారి ముందు ఉంచుతూ.. నేను తప్ప ఇన్ని స్కీంలు ఎవరూ అమలు చేయలేదు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాటిని 99శాతం అమలు చేశాను అంటూ .. మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలనను మీ ఇంటి ముందుకు తీసుకువచ్చాను అంటూ వివరించే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో కుటుంబంలో చీలిక రావడం, తల్లి విజయమ్మ సైతం షర్మిల వైపు నిలబడటం.. సోదరీమణులిద్దరూ కాలికి బలపం కట్టుకొని తన ఓటమి కోసం పనిచేయడం జగన్ కు ప్రతికూలంశాలుగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: