కేసీఆర్‌కి అగ్ని పరీక్ష పెట్టిన హరీశ్‌రావు?

ట్రబుల్ షూటర్.. పాలిటిక్స్ లో, మీడియాలో ఆయనకు ఉన్న పేరు. పాలిటిక్స్ లో ట్రబుల్స్ కి చెక్ పెడతారని పేరున్న వ్యక్తి. ఆయనే బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు.  ఆ పార్టీ అత్యంత ముఖ్యుల్లో ఆయన ఒకరు. ఓ రకంగా చెప్పాలంటే పార్టీలో నంబర్ టూ నుంచి త్రీ కి పడిపోయారు. అయినా కూడా ఆయన వాగ్ధాటికి.. ప్రశ్నల పరంపరకు ఫ్యాన్స్ ఉన్నారు.

టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు హరీశ్ రావు అన్నీ తానై ఆ పార్టీని నడిపించారు. అతిథి పాత్రలో కేసీఆర్ ఉండగా.. తెలంగాణ ఉద్యమాలు, ఇతర అంశాలపై తలామునకలై ఉండగా.. హరీశ్ రావు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం వంటివి చేసుకొచ్చారు. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే చిన్న చిన్నగా హరీశ్ రావుని పక్కన పెట్టడం స్టార్ట్ చేశారు.

2018లో జరిగిన ఎన్నికల్లో  విజయం సాధించిన తర్వాత చాలా రోజుల పాటు ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకోలేదు. మరోవైపు కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. దీంతో వీరికి హరీశ్ కి మధ్య గ్యాప్ ఏర్పడిందనే వార్తలు ఆ మధ్య కాలంలో వినిపించాయి.

అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ కాలు విరిగి మంచానికే పరిమితం కావడం.. పార్టీ ఓటమిపై సమీక్షలు, లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం వంటి అంశాలను కేటీఆర్, హరీశ్రావులే చూసుకున్నారు. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ ను నడిపించేది ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా కేసీఆర్ ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజలే నిర్ణయిస్తారు అని తెలిపారు. దీంతో ప్రస్తుతం రైతు రుణమాఫీ, ఇతర హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా అంటూ హరీశ్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక రకమైన టెంపోని సృష్టించగలిగారు.  కానీ కేటీఆర్ ఇంకా ఆ విధమైన వాతావరణాన్ని సృష్టించలేకపోయారు. దీంతో మరి జనం ఎవర్నీ ఆదరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: