గుంటూరులో జరగబోయేది ఇదే... జనాలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అత్యంత కీలక పాత్రను పోషించే జిల్లాలలో గుంటూరు జిల్లా ఒకటి. ఎందుకు అంటే ఇక్కడి నుండి ఎంతోమంది కీలక నేతలు పోటీ పడబోతున్నారు. దానితో ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఈ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కీలకపాత్రను పోషించబోతుంది. ఈసారి గుంటూరు జిల్లా ప్రజలు ఎవరి సైడ్ నిలబడబోతున్నారు..? ఎవరి గాలి ఎక్కువ వీస్తుంది అనే వివరాలను తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలో మొత్తం తాడికొండ, ప్రత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ అని మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి.

తాడికొండ నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా మేకపాటి సుచరిత బరిలో ఉండగా, కూటమి అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ బరిలో నిలిచాడు.  మేకపాటి సుచరిత ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా కొనసాగుతుంది. ఆమెకు ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. కాకపోతే ఈ ప్రాంతంలో ఈమెకు గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి అనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈమెను తాడికొండ సీటును కేటాయించాడు. దానితో ఈ ప్రాంతం ఈమెకు కొత్తది అయ్యింది. అయినప్పటికీ ఈమె చాలా సీనియర్ లీడర్ కావడంతో ఈ ప్రాంతంలో శ్రావణ్ కుమార్ కంటే కూడా ఈమెకి కాస్త ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రత్తిపాడు నుండి బలసాని కిరణ్ కుమార్ వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగగా, బూర్లా రామాంజనేయులు టీడీపీ అభ్యర్థిగా బారిలోకి దిగాడు. వీరిద్దరిలో రామాంజనేయులు సైడే కాస్త ఎక్కువ ఎడ్జ్ కనబడుతుంది. మంగళగిరి నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య పోటీలో దిగగా , టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ బరిలో ఉన్నారు. పోయినసారి లోకేష్ ఇదే స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఈయన ఇదే ప్రాంతంలో మళ్లీ పోటీ చేస్తూ ఉండడం, అలాగే టీడీపీ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు కావడంతో ఈ సారి ఇక్కడి ప్రజలు లోకేష్ సైడ్ నిలబడే అవకాశాలు కనబడుతున్నాయి. 

పొన్నూరు నుండి అంబటి మురళి వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగగా, ధూళిపాళ్ల నరేంద్ర కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగాడు. వీరిలో అంబటి మురళి సైడ్ కాస్త ఎడ్జ్ కనబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెనాలి నుండి వైసీపీ అభ్యర్థిగా అన్నా బాత్తని శివకుమార్ పోటీలోకి దిగగా, కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పోటీలోకి దిగారు. ఇక వీరిద్దరిలో మనోహర్ సైడే జనాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.  గుంటూరు ఈస్ట్ నుండి షేక్ నూరి ఫాతిమా వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగగా, కూటమి అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ పోటీలోకి దిగారు.

వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. రిజల్ట్ డే వరకు ఈ స్థానం గురించి కొంత సస్పెన్స్ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు వెస్ట్ నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా విడుదల రజిని పోటీలో ఉండగా, కూటమి అభ్యర్థిగా పిడుగురాళ్ల మాధవి బరిలో ఉంది. వీరిద్దరిలో రజిని ప్రస్తుతం మంత్రిగా పని చేస్తూ ఉండడం, అధికార పార్టీలో కీలక నేత కావడంతో ఈమెకు క్యాడర్ బలంగా ఉంది. దానితో జనాలు కాస్త ఈమె సైడ్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: