రాయలసీమ: కడపలో టీడీపీ అన్ని సీట్లు గెలుస్తుందా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని కడప రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.. ముఖ్యంగా అక్కడ వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటా అని కూడా చెప్పవచ్చు. ఇప్పటివరకు వైసీపీని అక్కడ ఏ పార్టీ కూడా టచ్ చేయలేదు.. ఈసారి 2024లో జరగబోయే ఎన్నికలలో జగన్ హవా తగ్గిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే సర్వేలు కూడా డబ్బులు తీసుకొని మరి వీలు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని విధంగా తెలియజేస్తూ ఉండేవారు. దీనిని పెయిడ్ ఆర్టికల్స్ అని కూడా పిలిచేవారు.. అయితే ఈసారి డైరెక్ట్ గా పార్టీ నుంచే లంచం తీసుకొని ప్రకటనలు చేస్తూ ఉన్నాయి ఈనాడు , ఆంధ్రజ్యోతి.

ఈనాడు కొత్తగా ఒక మైండ్ గేమ్ ప్రదర్శిస్తోంది. అలా ఒక్కొక్క జిల్లాలోని లెక్కలు చెబుతూ అక్కడ ఎవరు గెలుస్తారనే విషయాన్ని తెలియజేస్తోంది. కడప జిల్లాలోని టోటల్గా గెలవబోతున్నారని తెలుగుదేశం పార్టీకి మూడు సీట్లు వస్తాయని తెలియజేస్తున్నారు. ఇందులో పొద్దుటూరులో వరదరాజుల రెడ్డి గెలిచే అవకాశం ఎక్కువగా ... శివప్రసాద్ రెడ్డి ఓడిపోతారని.. అలాగే కమలాపురంలో వచ్చేటప్పటికి చైతన్య రెడ్డికి ఎక్కువ అవకాశాలున్న రవీంద్రారెడ్డి అంతకు ఈజీగా గెలవడని తెలియజేస్తున్నారు. అలాగే జగన్ మాత్రం గెలుస్తారు కానీ మెజారిటీ బీటెక్ రవి తగ్గించబోతున్నారంటు తెలియజేస్తున్నారు.

అలాగే మైదుకూరులో వచ్చేసరికి.. పుట్టా సుధాకర్ యాదవ్ కి ఒకసారి గెలుపు ఇద్దామని  ప్రజల అనుకుంటున్నారని.. రఘురామిరెడ్డిని ఓడిద్దామనుకుంటున్నారంటూ తెలుపుతున్నారు.. అలాగే జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద తీవ్ర అసంతృప్తి ఉంది కాబట్టి.. ఆదినారాయణ రెడ్డిని గెలిపించేద్దామనుకుంటున్నారని.. మరొకవైపు బద్వేల్ లో రోషన్ అని గెలిపిద్దాం అనుకున్నారని.. దాసరి సుదని ఓడిద్దామనుకుంటున్నారని తెలుపుతున్నారు. అక్కడ ఎవరు గెలిచినా కూడా స్వల్ప మెజారిటీతోనే నెగ్గుతారని.. ఇలా ఓవరాల్ గా కడప నియోజవర్గంలో రాసుకు వచ్చారు ఈనాడు.. ఇలా మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచా అవకాశం ఎక్కువగా ఉన్నాయనే కోణంలో రాసుకొచ్చారు.ఇప్పటినుంచి రోజుకొక జిల్లా చొప్పున ఇస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: