ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా : జో బైడెన్
ఇప్పుడు ఇలాంటి విషయమే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను అంటూ ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన విషయం కాస్త అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. అయితే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు ప్రస్తుతం ప్రపంచ దేశాలకు పెద్దన్నగా కొనసాగుతున్న అగ్ర దేశం అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్. బైడెన్ ఏంటి ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడమేంటి.. వినడానికి విచిత్రంగా ఉంది.. ఆయనకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు కదా. అయితే ఇటీవల ఎన్నో ఆసక్తికర విషయాలను ఆయన చెప్పుకొచ్చారు.
ఒకానొక సమయం లో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించాడు. 1972లో ఒక కారు ప్రమాదం లో నా భార్య కుమార్తె కన్ను మూశారు. దీంతో వారు పోయిన బాధలో మద్యానికి బానిసగా మారి పోయాను. ఇక నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్న. ఎన్నో రోజులు అలాంటి పిచ్చి ఆలోచనలే వచ్చేవి. కానీ నా ఇద్దరు కుమారులు గుర్తుకు వచ్చి ఆగిపోయేవాడిని. కాగా 1977లో జీల్ బైడన్ ప్రేమ వివాహం చేసుకున్న జో బైడెన్ అప్పటి నుంచి ఆమెకు తో వైవాహిక బంధం లో కొనసాగుతున్నారు.