ప్రత్యేక హోదాకి, ప్రత్యేక ప్యాకేజికి కొత్త నిర్వచనం చెప్పిన వైసిపి ఎమెల్యే రోజా
ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కు, ప్రత్యేక ప్యాకేజీ కి ఉన్న భేదాన్ని కొత్తగా నిర్వచించారు రోజా. "ప్రత్యేక హోదా అనేది జగన్ లాంటిదని ప్రత్యేక ప్యాకేజీ అనేది ముఖ్యమంత్రిగారి ఇంట్లో పనికి రాని పప్పు లాంటిది" అని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని అది వచ్చినప్పుడే ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్ లాగా అవుతుందని గత నాలుగేళ్లుగా వైసిపి అధినేత చెబుతూనే ఉన్నారని రోజా అన్నారు.
"సమయానికి టాయిలెట్లు కట్టించకపోతేనే జిల్లా కలెక్టర్లపై పోరాటం చేస్తానంటూ ముఖ్యమంత్రి వారిని బెదిరిస్తున్నారు. మరి, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా ఇవ్వనందుకు కేంద్రం ప్రభుత్వంపై పోరాటం చేస్తానని అన్న ముఖ్యమంత్రి ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు?" అని రోజా రాష్ట్రాన్ని, ఆ ప్రభుత్వాన్ని, అధినేతని నిలదీశారు.