నా చివరి ప్రసంగం ఇదే : సోనియాగాంధీ

Edari Rama Krishna
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టారు. తల్లి సోనియా నుంచి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. నేతలు, కార్యకర్తల హర్షధ్వనాల మధ్య రాహుల్ నెహ్రూ కుటుంబం ఐదో తరం నేతగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఎఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ గాంధీకి ఆయన తల్లి, ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. ఎఐసిసి కార్యాలయంలో జరిగిన సభలో సోనియా మాట్లాడుతూ అధ్యక్షురాలిగా తాను ఆఖరుసారిగా కాంగ్రెస్‌ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్నానని చెప్పారు.

రాహుల్ నాయకత్వంలో పార్టీని అందరూ కలిసి ముందుకు నడిపించాలని కోరారు. పార్టీ అధ్యక్షురాలిగా ఇదే తన చివరి ప్రసంగమని సోనియా చెప్పారు. ఇందిరాగాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. 19 ఏళ్ల క్రితం పార్టీ బాధ్యతలను చేపట్టినప్పుడు నావల్ల అవుతుందా? అని అనిపించిందన్నారు. అయితే అందరి సహకారంతో రెండుసార్లు పార్టీని అధికారంలోకి తేగలగామన్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చివరి సారి మాట్లాడుతున్నానని సోనియా గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 

 ఆమె ప్రసంగిస్తున్న సమయంలో బాణాసంచాలో భారీ ఎత్తున కాల్చాయి కాంగ్రెస్ శ్రేణులు. దీంతో ఆమె కొంత ఇబ్బందికి గురయ్యారు. సోనియా గాంధీ మాట్లాడుతున్నారని.. బాణాసంచా కాల్చడం ఆపేయాలని మరో కాంగ్రెస్ నేత మైకులో చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ సోనియాగాంధీ శక్తమంతమైన నేత అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక వాద్రాతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: