ముగ్గురు రెడ్ల పోరులో.. విజయం అయనదేనా?

praveen
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో రెడ్ల మధ్య ప్రముఖ  పోరు నెలకొంది అని చెప్పాలి. అయితే ఇక ఈ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ కి సిట్టింగ్ ఎంపీ స్థానం. అంతేకాదు కాంగ్రెస్ కంచుకోట అని కూడా చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కంచుకోట ని బద్దలు కొట్టి ఇక్కడ తమ పార్టీ జెండాను ఎగరవేయాలని బిఆర్ఎస్, బిజెపి పార్టీలు సర్వశక్తులు ఓడ్డుతున్నాయి  ఇప్పుడు నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరగగా.. వామపక్షాలు 8 సార్లు, కాంగ్రెస్ ఆరుసార్లు, టిడిపి రెండుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి చొప్పున గెలిచాయి.

 అయితే ఈసారి ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి బరిలో నిలిచారు. ఇక బిఆర్ఎస్ పార్టీ తరఫున కంచర్ల కృష్ణారెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పోటీ పడుతున్నారు. అయితే గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే నల్గొండ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. తమ సిట్టింగ్ తనని కాపాడుకోవాలని అనుకుంటుంది. ఈ పార్లమెంట్ స్థానంలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో విజయం మాదే అంటూ ధీమాతో ఉంది.

 అయితే ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు. ఒక్క సూర్యపేటలో బిఆర్ఎస్ నుంచి జగదీశ్ రెడ్డి విజయం సాధించగా.. కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్గొండ నియోజకవర్గలలో హస్తం పార్టీ విజయకేతనం ఎగరవేసింది. దీంతో మంచి పట్టు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈసారి విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న బిఆర్ఎస్ ఇక్కడ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మరోవైపు బిజెపి కూడా మోడీ చరిష్మాతో గెలుపును అందుకోవాలని అనుకుంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: