జగన్ రైతులకు ముష్టి 16 వేలు ప్రకటించాడట.. బాబు పాలనలో పది వేలైనా ఇచ్చారా?

Reddy P Rajasekhar
ఏదో సామెత చెప్పిన విధంగా వైసీపీ మేనిఫెస్టో ప్రకటించినా చంద్రబాబు నాయుడుకు ఆ మేనిఫెస్టోలో తప్పులే కనిపిస్తున్నాయి. జగన్ ప్రకటించింది మేనిఫెస్టో కాదని రాజీనామా పత్రం అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే అంగన్ వాడీలకు, హోంగార్డులకు వేతనాలు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీకి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అంటూ ఆయన మండిపడ్డారు.
 
2019 ఎన్నికల ముందు జగన్ కోడికత్తి డ్రామా ఆడారని ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారని బాబు చెప్పుకొచ్చారు. జగన్ కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో నిరుద్యోగుల ప్రస్తావనే లేదని చంద్రబాబు కామెంట్లు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు స్టైఫండ్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. జగన్ మేనిఫెస్టోలో రైతులకు ముష్టి 16 వేలు ప్రకటించారని చంద్రబాబు అన్నారు.
 
అయితే చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కనీసం రైతులకు 10,000 రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదని వైసీపీ ఫ్యాన్స్ చెబుతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో జగన్ చేసిన విమర్శల గురించి చంద్రబాబు స్పందించి ఉంటే బాగుండేదని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసి బాబు హామీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని సామాన్యులు కామెంట్లు చేస్తున్నారు.
 
చంద్రబాబు ప్రకటించిన హామీల గురించి ప్రస్తావించడం కంటే అమలు చేసిన హామీల గురించి ప్రస్తావిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు పాలన అంత అద్భుతంగా ఉండి ఉంటే 2019 సంవత్సరంలో 23 సీట్లకు కూటమి ఎందుకు పరిమితమైందనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు మాత్రం తెలివిగా తనపై వచ్చే నెగిటివ్ కామెంట్ల గురించి రియాక్ట్ కావడం లేదు. వైసీపీ మేనిఫెస్టో అమలు చేసే విధంగా ఉంటే టీడీపీ మేనిఫెస్టో గ్రాఫిక్స్ మేనిఫెస్టోలా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: