ఓటుకు నోటు కేసు - కాష్మోరా మళ్ళీ నిద్రలేవచ్చు - పాపం బాబుకు మళ్ళీ తలనొప్పే

"ఓటుకు నోటు కేసు" కాష్మోరాలా మళ్ళీ నిద్రలేవచ్చు కోర్టుల సెలవల తరవాత  అంటే  వేసవి తరవాత విచారణకు రానుంది. తెలుగుదేశం అధినేత అద్భుతమైన మానేజ్మెంట్ ఇంద్రజాలం తెలిసినవారంటారు. కొంతమంది ఆయన చంద్రబాబు కాదు ఇంద్రబాబు అని చలోక్తులుకూడా విసురుతారు. ఏమీ పట్టించుకోనట్లు పైకి గాంబీర్యం ప్రదర్శిస్తూనే లోపల లోపల ఎన్నో ఘనకార్యాలు చేస్తూ ఉంటారట. ఎక్కడైనా, అక్కడపడితే అక్కడ తనకు స్వప్రయోజనముంటే చక్రం తిప్పే అలవాటు ఉండటంతో చాలా మంది చక్రంబాబు అనికూడా అంటూ ఉంటారు.


ఈ సొదంతా ఎందుకంటారా? ఈ మధ్య బాబుగారు రాజధాని డిల్లిలో ఒక ఆరు గంటలు సెక్యూరిటీకి కూడా చెప్పకుండా మాయమైపోయారట. అదీ ఏయిర్పోర్టు లో. ఇటీవల అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చి ఢిల్లీలో ఏడెనిమిది గంటల పాటు బాబు కనిపించక పోవటానికి "ఓటుకు నోటు కేసు విచారణకు సంబంధం ఉంద" నే మాట డిల్లీలో బాగా వినిపిస్తోంది.


“ఓటుకు నోటు కేసు”  ఇంకో మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఒక ప్రజాప్రతినిదిని కొనగొలు చేయటానికి టిడిపి తన ఎమెల్యే రెవంత్ రెడ్డిని అదే  “ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను కొనబోయిన వ్యవహారం”  ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు నడుస్తుండటంతో నివురుగప్పిన నిప్పులా ఉంది. వేసవి సెలవులు ముగిశాక, ఈ కేసు మళ్లీ విచారణకు రానున్నదనే మాట వినిపిస్తోందిప్పుడు.


 ముందుగా చెప్పాల్సిన అంశం, మనకు తెలియాల్సిన విషయమేమంటే ఇదేమీ అషామాషీ వ్యవహారం మాత్రం కాదు తీర్పు ప్రతికూలంగా వస్తే మాత్రం చంద్ర బాబును అరెస్టు చేయడం,  ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి రావడం జరగవచ్చు. అంత సీరియస్ వ్యవహారం ఇది! ఒకవేళ అరస్టైతే ఏమిటని ఆలోచించే లోకేష్ ను మంత్రి మండలిలోకి తెచ్చారని టిడిపి వర్గాల బోగట్టా.


తెలంగాణ ప్రభుత్వంతో రాజీపడి, 1. హైదరాబాద్ ను ఖాళీ చేసి,  2. తెలంగాణలో టీడీపీని గంగపాల్జేసి అంటే బలోపేతం చేయడాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడంతో బాబు ఈ వ్యవహారం తన పీకల మీద వరకూ రాకుండా చూసుకోగలుగుతున్నారనేది ఎవ్వరూ కాదనలేని సత్యం.ఇక్కడ ప్రయోజనం కోల్పోయేదెవరు? మూల్యం చెల్లించే దెవరు?  పాపం కప్పిపుచ్చుకునేదెవరు? ఈ కేసును తప్పించుకోవటానికే బాబు ప్రత్యేక ప్రతిపత్తి లాంటి రాష్ట్రానికి అత్యంత ప్రయోజనకరమైన అంశానికి తిలోదకాలి చ్చారని విజ్ఞుల వాదన.


తెలంగాణలో టీడీపీని బాబు చేతే చంపించడంతో టీఆర్ఎస్, దాని అధినేత వ్యూహం ఫలింపజేసుకొని ఈ వ్యవ హారంలో సైలెంటయ్యింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  “బ్రీఫ్డ్ మి ద్వారా  ఇన్-వాల్వ్ “ అయి ఉన్న ఈ వ్యవ హారాన్ని పూర్తిగా డైల్యూట్ చేయడం లేదు. తెలంగాణా ప్రభుత్వం. ఎందుకంటే కేసిఆర్ బాబును పూర్తిగా నమ్మరు. బాబు పీక చేతిలో పట్టుకునే ఉన్నారు.


ఇదే సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకూడా ఈ వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల తర్వాత ఓటుకు నోటు కేసు మరోసారి విచారణకు రానుంది. మరి ఇప్పుడేం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.


రక్షణ సిబ్బందికి కూడా చెప్పకుండా బాబు మాయమై, ఢిల్లీ లోని తన సన్నిహితుల (న్యాయస్థానాలకు సంభందించిన ప్రముఖులు లేదా న్యాయవాదుల ఇళ్ళకు కావచ్చు) ఇళ్లలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని, ఈ వ్యవహారం తన పీకల దాకా రాకుండా చూసుకున్నారని అభిజ్ఞవర్గాల కథనం. సమాచారం. అంతకుముందే జగన్ మోహన్ రెడ్డి మోడీతో సమావేశం కావడంతో బాబుకు లోపల అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నా దాన్నొదిలి ఈ పనిమీద పడ్దారని అంటే ఇదెంత ప్రమాదకరమో?  అంటు న్నారు కోర్ట్ వ్యవహారాలు తెలిసిన నిపుణులు. టెన్షన్ అమాంతం పెరిగిపోయిందని, ఒక వేళ ఈకేసు ఏమన్నా డెవిల్ లాగా నిద్రలేస్తుందేమోనని అలా జరిగితే ఈ వ్యవ హారం ఎందాకా వెళుతుందో చూడాలనే క్రమంలో బాబు బయపడుతున్నారని అనుకుంటున్నారట..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: