ఏపీ: జగన్ వంటి దుర్మార్గుడైన వ్యక్తిని మోడీ క్షమించరు: పవన్ కళ్యాణ్

Suma Kallamadi
ఏపీలో ఎన్నికల వేళ విపక్షాలు ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పీల్చుకుంటున్నారు. తాజాగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలో వారాహి విజయభేరీ సభలో పాల్గొన్న జనసేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ అధినేత జగన్ పైన తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. నిజాయితీ అనేది మచ్చుకైనా లేని అవినీతి పరుడైన జగన్ మోహన్ రెడ్డి వంటి వ్యక్తులను ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా శిక్షిస్తారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ, జగన్ ఈ ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి గురించి అస్సలు పట్టించుకోలేదని, తన కేసులు మొత్తం మాఫీ చేసుకునేందుకు ప్రధాని మోడీ వద్దకు వెళ్లి కాళ్ళు పట్టుకొనేవాడని దుయ్యబట్టారు. అయితే మోడీ అలాంటి వ్యక్తులకు గౌరవం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. ముఖ్యంగా, అనేక అవినీతి కేసులు ఉన్న జగన్.. ప్రధాని నరేంద్ర మోడీ వద్ద గట్టిగా మాట్లాడగలరా? అంటూ ప్రశ్నించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... గత ఐదేళ్లలో జగన్ పాలనా దుర్మార్గం గురించి మోడీ తనతో చర్చించారని, అందుకే ఈ ఎన్నికల్లో కూటమికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు లంచాల సొమ్ము, అవినీతి సొమ్ము అవసరం లేదని తాను ఒక సినిమా చేస్తే నిర్మాతలు కోట్లు కొలదీ కుమ్మరిస్తారని, యువతకు మెరుగైన భవిష్యత్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వస్తేనే యువత జీవితాలు బాగుపడతాయని, ముఖ్యంగా యువతీయువకులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.
ఇంకా పవన్ మాట్లాడుతూ... "దాదాపు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, మూడున్నరేళ్లుగా సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇపుడు మన కూటమిలో ఉండడం చాలా పెద్ద బలం. నేను గత దశాబ్ద కాలంగా పోరాడుతూనే వున్నాను. కాబట్టి అర్ధం చేసుకొని మాకు అండగా నిలబడండి. రాష్ట్రం కోసం పని చేసే బాధ్యత మేము తీసుకుంటాం!" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: