టీడీపీ: హంతకులకు అండగా.. ప్రజలు విశ్వసిస్తారా..?

Divya
రాజకీయాలు అంటేనే ప్రజలకి విరక్తి కలిగించేలా చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న నాయకులు.. రాజకీయ పార్టీలో ఒక వ్యక్తిని చేర్చుకోవాలంటే.. ఒక అర్హత ఉండాలి.. ముఖ్యంగా మంచోడు లేకపోతే చదువుకున్న వారు లేకపోతే వర్గాలతో మంచి సంబంధం ఉన్నదా.. అలాంటివారిని చేర్చుకోవడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ జగన్ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. గతంలో జగనే ఈ పని చేయించుకున్నారనే విషయాన్ని కూడా చాలా వైరల్ చేశారు. మరోవైపు వైసీపీ శ్రేణులు కోడి కత్తి శ్రీను కుటుంబం తెలుగుదేశం పార్టీ అని.. తెలుగుదేశం హయాంలోనే వారికి ఇల్లు వచ్చాయనే.. వార్తలు కూడా వైరల్ చేశారు .

ఇప్పుడు జగన్ మీద హత్యా ప్రయత్నం చేయడమే ఒక ఎజెండాగా.. అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకొని విచిత్రమైనటువంటి ట్విస్ట్  ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు.. గడిచిన శనివారం తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిన జేల్లిపల్లి తాంతారావు.. కోడి కత్తి శ్రీను తండ్రి.. జల్లిపల్లి సావిత్రి.. కోడి కత్తి శ్రీను తల్లి.. జల్లిపల్లి సుబ్బరాజు.. శ్రీను అన్నయ్య.. కోడికత్తి శ్రీను చిన్నాన్న జల్లిపల్లి వెంకటేశ్వరరావు..జల్లిపల్లి నాగేశ్వరరావు లు  టిడిపి , జనసేన , బిజెపి కూటమిలో భాగంగా టిడిపి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో టిడిపి పార్టీలోకి చేరారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం.. రానా లంక పెద్దపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో కోడి కత్తి శ్రీను మాట్లాడుతూ.. ఐదేళ్లపాటు సెంట్రల్ జైల్లో మగ్గిపోయానని.. తనకు ఎవరు సహకరించలేదని.. జైలు నుంచి తన విడుదలకు కారణమైన ప్రతి ఒకరికి ధన్యవాదాలు తెలుపుతూ తాను ఈరోజు ఇలా ఉండడానికి ముఖ్య కారణం , ప్రతిపక్షాలు,  ఎస్సీ సంఘాలే కారణమని,  జైలు నుంచి తనను విడుదల చేసేందుకు అన్ని పార్టీల మద్దతు తనకు వచ్చిందంటూ తెలియజేశారు. ఇకపోతే స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయాలనుకున్నానని.. కానీ పరిస్థితులు అనుకూలించక పోటీ చేయలేదని స్పష్టం చేశారు కోడి కత్తి శ్రీను. మొత్తానికి అయితే కోడి కత్తి శ్రీను ని తన పార్టీలోకి చేర్చుకొని అందరిని ఆశ్చర్యపరిచింది టిడిపి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: