తిరుపతి: బాబు గెలుపు కోసం భువనేశ్వరి మరో సంచలన నిర్ణయం..!

Divya
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. అలాగే అధికారాన్ని కూడా చేపట్టాలని ఎన్నో పార్టీలతో పొత్తు పెట్టుకుని మరి ఈసారి బరిలోకి దిగబోతున్నారు. గతంలో అనుకోకుండా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చిక్కుకోవడంతో పాటు 50 రోజులు వరకు జైలు జీవితాన్ని గడిపారు. ఈ సంఘటన వల్ల టిడిపి అభిమానులు చాలామంది మృతి చెందడంతో వారిని పరామర్శించేందుకు చంద్రబాబు భార్య భువనేశ్వరి వారి కుటుంబాలను పరామర్శిస్తూ ఆర్థిక సహాయం కూడా చేసింది.

ఈసారి ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు గెలుపు కష్టమనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో కుప్పం పైన టిడిపి పార్టీ మరింత ఫోకస్ పెట్టింది.. గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా భువనేశ్వరి కుప్పం ప్రజలతో మమేకం అవుతూ  పలు రకాల నియోజకవర్గాలను చుట్టేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ కొద్దిరోజుల పాటు తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం అక్కడే ఉండబోతున్నట్లు నిర్ణయం తీసుకుందట. ఎలాగైనా ఈసారి చంద్రబాబును గెలిపించి టిడిపి పార్టీ అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వీటితో పాటు మే ఒకటవ తేదీ నుంచి కడప, పాణ్యం, దర్శి, కమలాపురం ఇతరత్న నియోజకవర్గ నేతలతో భేటీ అయి వారి యొక్క సమస్యలను తెలుసుకొని భరోసా ఇచ్చేలా నియోజవర్గాలలో పర్యటించేల భువనేశ్వరి ప్లాన్ చేసిందట.

ముఖ్యంగా బీజేపీ ,టిడిపి, జనసేన కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న సమయంలో ఎన్నికల ప్రచారాన్ని కూడా వేగవంతం చేస్తున్నారు. అటు చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ఇటు బాలకృష్ణ ఆయన భార్య.. అలాగే చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణ సైతం ఈసారి ఎన్నికలలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలయ్య చిన్న కూతురు తేజస్వినికూడ తన భర్త విశాఖపట్నం లోక్ సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇలా నారా, నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎన్నికలలో పాల్గొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: