రేపే రాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే..?
ఈ మేరకు మేకర్స్ హైదరాబాదులో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈవెంట్ కి ప్రభాస్ కూడా హాజరు కాబోతున్నారు. డిసెంబర్ 27న భారీ ఎత్తున ఈవెంట్ చేస్తున్నారు. అయితే మొదట ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో చేయాలనుకున్నప్పటికీ అనుమతులు లభించకపోవడంతో రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా కాదని ఈవెంట్ ని సిటీలోని కైతలపూర్ గ్రౌండ్ లో నిర్వహించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ప్లేస్ మార్చినట్లుగా వినిపిస్తోంది.
ఈవెంట్లో మరొక ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించి కూడా ఏర్పాటు జరిగినట్లు సమాచారం. గతం లో వచ్చిన ట్రైలర్లో ప్రభాస్ వింటేజ్ వైబ్ తో అభిమానులను ఖుషీ చేశారు. ఇప్పుడు మరి సెకండ్ ట్రైలర్ సినిమా పైన ఎలాంటి అంచనాలను క్రియేట్ అయ్యేలా చేస్తాయో చూడాలి మరి. ఈ ట్రైలర్ తోనే సినిమాకి భారీ హైప్ ఏర్పడేలా డైరెక్టర్ మారుతి ప్లాన్ చేసినట్లుగా వినిపిస్తోంది. మొదటిసారి ప్రభాస్ ఇలాంటి విభిన్నమైన జోనర్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఫౌజి, స్పిరిట్ వంటి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రభాస్.