సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. సంక్రాంతి పండక్కు ఎక్కువ శాతం మంచి క్రేజీ సినిమాలు , స్టార్ హీరోలు సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. చిన్న హీరోల సినిమాలు కొన్ని సందర్భాలలో మాత్రమే విడుదల అవుతూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం సంక్రాంతి పండక్కు స్టార్ హీరోల సినిమాలు విడుదల కాపడం వల్ల చిన్న హీరోలు సినిమాలు విడుదల అయినా కూడా వాటికి మంచి కలెక్షన్స్ రావు అనే ఉద్దేశంతో సంక్రాంతి సీజన్లో చిన్న హీరోల సినిమాలను , పెద్దగా క్రేజ్ లేని సినిమాలను మేకర్స్ విడుదల చేయరు. ఇకపోతే సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు కొంత మంది హీరోల మధ్య గట్టి పోటీ ఏర్పడుతూ ఉంటుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు ఇద్దరు హీరోయిన్ల మధ్య మంచి పోటీ నెలకొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఆ ఇద్దరు బ్యూటీలు సంక్రాంతి పండక్కు తమ సినిమాలతో వచ్చి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఇంతకు ఆ బ్యూటీలు ఎవరు అనుకుంటున్నారా ..? వారు ఎవరో కాదు ... పూజా హెగ్డే , మీనాక్షి చౌదరి. పూజా హెగ్డే కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరో గా రూపొందిన అలా వైకుంఠపురంలో అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. వచ్చే సంవత్సరం ఆమె నటించిన జన నాయగన్ అనే సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నారు. మీనాక్షి చౌదరి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. వెంకటేష్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి "అనగనగా ఒక రాజు" అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ఈ ఇద్దరు బ్యూటీలు వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.