ప్రధానిపై ముఖ్యమంత్రి పద్మవ్యూహం పన్నారా? లేక కుడి ఎడమౌతుందా?



ఒకవేళ జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని వద్దకు వెళ్లుంటే "ప్రత్యేక హోదా గురించి ప్రధాని దగ్గర ఎందుకు ప్రస్థావించలేదంటూ" సీఎం చంద్రబాబు నాయుడు కూడా విమర్శించారు. అయితే, ఈ విషయం పరంగా చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలు, పరోక్షంగా పర్ధాని నరెంద్ర మోడీని లక్ష్యం చేసుకుని అన్నట్లుగా కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషణలు కనిపిస్తున్నాయి. 


అంటే జగన్ తలపై నుండి మోడీ కి తగిలేలా శరసంధానం చేసినట్లు బాబు విమర్శించే క్రమంలో కనిపిస్తుంది. చంద్రబబు చెప్పినట్లు చెపుతున్న ఒక కథనం ప్రకారం, "రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్రం లోని భాజపా సర్కారుకు జగన్ మద్దతు ఇస్తున్నారనీ, దీనికి ప్రతిఫలంగా తనపై ఉన్న కేసుల నుంచి బయపడాలని జగన్ ప్రయత్నిస్తు న్నారనీ, ఇది క్విడ్ ప్రోకో అవుతుంది కదా?"  అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు ఆ కథనం. తనపై ఉన్న అవినీతి ఆరోపణలు, ఈడీ కేసుల నుంచి విముక్తి కల్గించు కోవడం కోసమే జగన్ కేంద్రంతో ఏర్పాటు చేసుకున్నారని అన్నట్లు తెలిస్తుంది. 


ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి ఆనాడు అంగీకరించి ఒక ఒప్పందానికి వచ్చి రాజీపడింది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే అనీ, హోదాకి సమాన మైన ప్యాకేజీని తాను సాధించుకొచ్చానని చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారట. 


అయితే ఇందులో ఒక తిరకాసు ఉందని పిస్తుంది.

కేసుల నుంచి విముక్తి పొందటానికే ప్రధానితో జగన్ కాళ్ళబెరానికి వచ్చారని కాళ్ళు పట్టుకున్నారని విమర్శించడం వరకూ సందర్భానికి తగిన విధంగా ఉన్నా!  అది వైకాపాని విమర్శించినట్టు మాత్రమే  అవుతుంది. అలాకాకుండా "క్విడ్ ప్రోకో" (నీ కిది- నా కది) కి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించడము లోనే అత్యంత ప్రమాధకర చంద్రబాబు తరహా లేక పౌరాణికంగా చెప్పాలంటే శకుని తరహా  "రాజకీయ పద్మవ్యూహం"  ఉందని విమర్శకుల భావన. ఎలా అంటే:


"క్విడ్ ప్రోకో' అంటే "నీ కిది నా కది  అనే స్కీము" లో ఇరువర్గాలకు ప్రయోజనం ఉండటమే దాని లక్ష్యం కదా! అంటే, రాష్ట్రపతి ఎన్నికలో బిజెపి మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వడం బిజెపికి ఒనగూడే ప్రయోజనం కాగా----తనపై ఉన్న సిబిఐ, ఈడి తదితర కేసుల నుంచి విముక్తి పొందడం జగన్ కు లభించే ప్రయోజనం గా ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించినట్టు అర్థం చేసుకోవాలని విమర్శకులు అంటున్నారు. అంటే అర్ధం పరోక్షంగా తన చాతుర్యాన్ని ప్రయోగించి నరెంద్ర మోడీని నిండా ఈ రొంపిలోకి తెచ్చే ఘఠనలే - ఈ వాగ్భాణాలని బిజెపి వాళ్ళు భావిస్తున్నారు.


గతములో ఈ ఇరికింపులు బెదిరింపులు బాబుగారికే తెలుసనుకునే వాళ్ళని, ఆ రోజులెప్పుడో పోయి "బండిని రివర్స్ గేరులో" ఎలా నడిపించాలో నమో కి బాగా తెలుసని ఒక వర్గం మీడియా అంటూంది. 


అసలు జగన్ కి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడమే టీడీపీ నేతలకు ఇష్టంగా లేదని వారికి చేదు మాత్ర మింగినట్లుందనేది  యదార్ధం. ఆర్థిక, భూకబ్జా నేరా రోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో ప్రధాని భేటీ ఏంటీ? అసహ్యంగా! అంటూ టీడీపీ అధికార ప్రథినిధులుగా పేరున్న నేతలు ఎవరో తట్టిలేపినట్లు ఒక్కసారిగా ఒకరితరవాత మరొకరు తప్పు బట్టి, బురద జల్లి, రాళ్ళు వేసిన సంగతి బిజెపి నేతలు గుర్తించారనే అర్ధమౌతుంది.


అందుకే బిజెపి సౌమ్యుడైన నేత కన్నా లక్ష్మినారాయణ  "కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది పీఠాలు కదులుతాయి" అని కాస్త కటువుగానే అన్నట్లు తెలుస్తుంది. వెంకయ్య నాయుడు కూడా జగన్-మోడీ సమావేశమైతే మీకు అంత ఉలికిపాటెం దుకు? అన్న విషయాలు బహుశ మోడీ-షా మనసెరిగి మాట్లాడినట్లున్నాయి అంటున్నారు టిడిపి లోని కొందరు ప్రముఖులు. దీనికి తోడు జగన్ ప్రధాని సమావేశం విషయంలో టీడీపీ ప్రవర్తించిన తీరే సరిగా లేదన్నట్టుగా రాజ నీతిజ్ఞులు అనేకులు విమ ర్శించారు. 


ఈ నేపథ్యంలో ఇప్పుడు "క్విడ్-ప్రోకో" ప్రధాని జగన్ భేటీ నుండి వ్యూహాత్మకంగా, చంద్రబాబు -కేసిఆర్ ల వెలుపలకు రాని ఒపందానికి మోడీ-షాలు లంకె పెట్టి చుట్టేసే చాణక్య తంత్రం  కూడిన  వ్యూహం సిద్దమౌతుందని డిల్లి నుండి  వార్తలు వస్తున్నాయి. అంటే బ్రీఫ్డ్-మి  ఆడియో మనం మరల వీడియోగా టివీల్లో  చూడ బోతున్నమన్న మాట. అందుకే బయటకు "మేక పోతు గాంభీర్యం" చూపినా లోలోపల టిడిపి మొగలిపొదలా రగులుతోందని తెలుస్తుంది.  బాబు పన్నిన వ్యూహం ఆయన మెడకే చుట్టేస్తున్నారేమో నమో?


అయినా ఎంత తెలివైనవాడు కాకపోతే చాయ్-వాలా స్థాయినుండి ప్రధానికాగలిగాడు? ఈ రాజకీయచదరంగంలో గెలుపెవరిది! చెక్ చెప్పగలిగే వారు ప్రధానే అంటున్నారు విజ్ఞులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: