కేసీఆర్ కు ఏమైంది.. ఢిల్లీలో ఆపరేషన్లు ఎందుకోసం..!?

Chakravarthi Kalyan
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో తన వైద్యంపై దృష్టి పెట్టారట. కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం కొన్ని ఆపరేషన్లు కూడా 
చేయించుకోబోతున్నారట. ఇంతకూ కేసీఆర్ కు ఏమైంది. ఆయన ఆపరేషన్లు చేయించుకునేది దేని కోసం.. టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులను ఈ ప్రశ్నలు 
కలవరపెడుతున్నాయి.



ఐతే.. కేసీఆర్ కు జరగబోయే ఆపరేషన్లన్నీ మైనర్ వేనట.. ఆయన కొంత కాలంగా దంత సమస్యలతో బాధపడుతున్నారు. పిప్పి పళ్ల సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. దీని కోసం ఆయన ఇప్పటికే పరీక్షలు చేయించుకున్నారట. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వంటి ప్రముఖులకు చికిత్స చేసిన ప్రముఖ వైద్యురాలి దగ్గర కేసీఆర్ చికిత్స 
పొందుతున్నారట. 



దంత సమస్యల కోసం కేసీఆర్ కు రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ చేశారట. ఈ ట్రీట్ మెంట్ తర్వాత ఒకటి, రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేసీఆర్ కంటి సమస్య కోసం ఆపరేషన్ చేయించుకుంటారట. గురువారం కేసీఆర్ ను దంతవైద్యులు పరీక్షించనున్నారు. ఈ పరీక్షల తర్వాత ఆయనకు కంటి శస్త్రచికిత్స ఎప్పుడు 
చేయాలన్నది నిర్ణయిస్తారట. 



ఈ ఆపరేషన్లీ చిన్నవేనని.. టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్దగా ఆందోళన చెందాల్సిందేమీ లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గురువారమే ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చేస్తారు. కంటి ఆపరేషన్ కోసం వైద్యులు నిర్ణయించిన తేదీకి మళ్లీ ఢిల్లీ వెళ్తారని టీఆర్ఎస్ వర్గాలు వివరించాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: