సునామీ మింగిన నాగరికతలు హరప్పా.. మొహంజొదారో...!!

Shyam Rao
మానవుడు అవతరించిన తర్వాత మానవ సమూహాలు ఏర్పడ్డ తర్వాత క్రీస్తు పూర్వం చర్రిత్రకు అందిన అథో గొప్ప నాగరికతలు ఏవంటే వెంటనే వచ్చే సమాధానం హరప్పా, మొహంజొదారో నాగరికత లు అని. అయితే మన దేశ చరిత్ర పుస్తకలాను ఒక్క సారి తిరిగేస్తే మనకు అర్థం అయ్యే విషయం ఏంటంటే మన దేశ చరిత్ర వీటితోనే ప్రారంభమైందని స్పష్టంగా తెలుస్తోంది. చరిత్ర పుస్తకాల్లో, పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే ఈ నాగరికతలు సునామీ ధాటికి కొట్టుకుపోయాయని తెలుస్తోంది. 



ఈ నాగరికతలకు సంబంధించిన పరిపాలానా వ్యవస్థ, విధానం చాలా గొప్పగా, ఆధునాతనంగా ఉండేవని చాలా మంది చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇటీవల తవ్వకాల్లో బయటపడ్డ ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటే అప్పట్లో నే ప్రజలు విలాసవంతమైన ఆధునిక జీవనం గడిపారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే అప్పటి రాజ్యాలను రాజు పరిపాలించారా, ప్రభుత్వం పరిపాలించిందా, పరిపాలించిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే వీరు మన దేశానికి వాయువ్య ప్రాంతం నుండి వచ్చి స్థిరపడ్డారని తెలుస్తోంది. 



అయితే ఈ ప్రాంతాలు కొన్ని దశాబ్ధాలు వర్థిల్లినా ఆ తరవాత విదేశీ సైన్యం దాడిలో కొంత దెబ్బతింటే, సునామీ ధాటికి పూర్తిగా దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది. ధోలవీర.. హరప్పా నాగరికతలో అతి పెద్ద రేవు పట్టణం. నూటా ఇరవై ఎకరాల్లో విస్తరించిన నగర జీవనం. క్రీస్తుపూర్వం 5000 నుంచి దాదాపు 15 వందల ఏళ్లపాటు విలసిల్లింది. నాడు ఉపఖండానికి అరేబియా సముద్ర ముఖ ద్వారంగా భాసిల్లింది. క్రమంగా అక్కడి నాగరికత అంతరించి పోయింది. రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ఉప్పునీటి కయ్యల్లోని ఒక దీవిలో 1967లో తొలిసారిగా ధోలవీర శిథిలాలను కనుగొన్నారు.



హరప్పా నాగరకతకు సంబంధించిన అయిదో అతిపెద్ద అవశేష కేంద్రమని గుర్తించారు. ఆ తర్వాత చరిత్రకారులు ధోలవీర పతనం గురించి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు. ఇప్పుడు అదే విషయాన్ని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు జాతీయ సముద్ర విజ్ఞాన శాస్త్ర సంస్థ(ఎన్‌ఐవో), శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన సంస్థ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తవ్వకాలు జరపకుండానే ధోలవీరకు సంబంధించిన భూభౌతిక సమాచారాన్ని రాబడుతున్నాయి. ఎన్‌ఐవో శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... ధోలవీర సునామీ వల్లే అంతరించి పోయింది.



సునామీలు కొత్త కాదు 
* రాజీవ్‌ నిగమ్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది. ధోలవీర అంతర్ధానానికి కొంతవరకైనా సునామీ కారణమని చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో అతిపెద్ద సునామీలు అసాధారణమేమీ కాదు. రేవు పట్టణం మందపాటి గోడలుచూస్తే అక్కడి వారికి సునామీల గురించి, వాటి ముప్పు గురించి బాగానే తెలుసని అర్థమవుతోంది. వాటిని ఎదుర్కోవడం వారికి బాగా తెలుసు.
* ధోలవీరలో కోట, మధ్యపట్టణం, దిగువ పట్టణం... అనే మూడు భాగాలున్నాయి. 14-18మీటర్ల మందమున్న రక్షణ గోడే పట్టణ ప్రత్యేకత. చరిత్రలో యుద్ధాలు ఎక్కువగా జరిగిన రోజుల్లోనూ, అత్యంత విధ్వంసకర ఆయుధాలు కనిపెట్టినప్పుడూ ఇంతటి మందమైన గోడలు కట్టలేదు. ఇవి కచ్చితంగా యుద్ధాలనుంచి రక్షించుకొనే గోడలు కావు.
* అరేబియా సముద్ర ఉత్తరప్రాంతంలో సునామీలు ఎక్కువే. 1945లో పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో వచ్చిన భూకంపం తీవ్రతకు అరేబియా సముద్రంలో పది మీటర్ల ఎత్తున కెరటాలతో సునామీ వచ్చింది. ఉత్తర తీరంలో నష్టం కలిగించింది. అలాంటి సునామీయే క్రీస్తుపూర్వం ధోలవీరను తుడిచిపెట్టేసింది. సునామీల వల్ల ధోలవీరలో ఏర్పడిన అవక్షేపాలకాలాన్ని ధ్రువీకరించే పరీక్షలు చేస్తాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: