ఏపీ: ఆ 14 సమస్యాత్మక నియోజకవర్గాల్లో 100% వెబ్‌కాస్టింగ్..!

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 13వ తేదీన జరగనున్నాయి. అయితే దీనికంటే ముందు వివిధ వివాదాస్పద సంఘటనలు జరిగాయి. వీటి గురించి చాలామంది ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. బీసీవై అధినేత బోడె రామచంద్ర యాదవ్ కూడా పుంగనూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందంటూ ఇటీవల కాలంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం పుంగనూరును ఒక సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించింది.
అలానే జరిగిన సంఘటనలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 సమస్యాత్మక నియోజక వర్గాలు ఉన్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటికి సంబంధించిన పేర్లను కూడా ఈసీ ప్రకటించింది. ఈ ప్రాంతాలలో 100 శాతం వెబ్‌కాస్టింగ్‌తో పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేసింది. అలానే ఈ నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఆర్పీఎఫ్ బలగాలు భారీ సంఖ్యలో మోహరిస్తాయని తెలిపింది. మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్ సభ పోలింగ్ ప్రశాంతంగా సాగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి నిర్లక్ష్యాన్ని తాము సహించబోమని కూడా స్పష్టం చేసింది.
ఇకపోతే ఏపీలో ఉన్న ఆ సమస్యాత్మక నియోజకవర్గాలలో మాచర్ల, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె ఉన్నాయి.ప్రధాన ఎన్నికల అధికారి హాస్టల్లో ఆయా చోట్ల చోటు చేసుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని వీటిని సమస్యాత్మక నియోజక వర్గాలుగా పరిగణించినట్లు తెలిపారు. ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఒక వైపు ప్రచారాలు జోరందుకుంటే మరొకవైపు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చక చకా చేసేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఏం వారు కూడా ఏపీ ఎన్నికల ప్రచారాల్లో భాగమవుతున్నారు. జగన్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వంటి నేతలు ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను బాగా హీట్ ఎక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: