రాజమౌళిని కార్నర్ చేసిన మీడియా !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో రాజమౌళి ఖ్యాతి ప్రపంచవ్యాప్తం అయినప్పటికీ ఆమూవీతో జక్కన్న మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల అసహనానికి లోనైన విషయం తెలిసిందే. ఈమూవీలో రాజమౌళి రామ్ చరణ్ పాత్రతో సమానంగా జూనియర్ ఎన్టీఆర్ పాత్రను క్రియేట్ చేయలేకపోయాడని తారక్ అభిమానుల అసహనం. దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలో అనేక విమర్శలు కూడ వచ్చాయి.

ఈమూవీ విడుదలై మూడు సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ ఈవివాదాలు రాజమౌళిని వదలడం లేదు. లేటెస్ట్ గా రాజమౌళి ఆద్వర్యంలో క్రియేట్ చేయబడ్డ ‘బాహుబ‌లి’ ది క్రౌన్ ఆఫ్ బ్ల‌డ్ యానిమేష‌న్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేయబడ్డ మీడియా సమావేశంలో జక్కన్నకు మళ్ళీ ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురుకావడంతో రాజమౌళి అసహనానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి.

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఒక హీరో పాత్రే ఎలివేట్ అయింది ఇంకోదానికి ప్రాధాన్యం త‌గ్గిందనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి దీనిపై మీరేమంటారు అంటూ ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా రాజమౌళి కొంత అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో అతడిని మరికొన్ని ప్రశ్నలు కూడ వెంటాడినటట్లు టాక్. అయితే ఈప్రశ్నలకు కూడ జక్కన్న మీడియాకు కోపం రాకుండా సున్నితంగా సమాధానం చెప్పి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ‘బాహుబ‌లి’ ది క్రౌన్ ఆఫ్ బ్ల‌డ్ గురించి మాట్లాడుతూ ఇది ‘బాహుబ‌లి’ కి సీక్వెలూ కాదు ప్రీక్వెలూ కాద‌ని రాజ‌మౌళి స్ప‌ష్టం చేశాడు. ‘బాహుబ‌లి’ అస‌లు క‌థ మ‌ధ్య‌లో ఏమి జ‌రిగి ఉంటుంద‌నే ఊహ‌తో ఈక‌థ న‌డుస్తుంద‌ని ఇందులో చాలా హైలైట్లు ఉంటాయని అంటున్నాడు. ఈ యానిమేటెడ్ సిరీస్ లో క‌ట్ట‌ప్ప త‌ల‌ప‌డే స‌న్నివేశాలు భ‌లేగా ఉంటాయ‌ని హాలీవుడ్ ద‌ర్శ‌కుల్లా త‌న‌కు యానిమేష‌న్ మూవీస్ చేయాల‌ని ఉంద‌ని అంటూ తన మనసులో మాట బయట పెట్టడంతో ఇక రానున్న రోజులలో జక్కన్న ఆలోచనలు అన్నీ హాలీవుడ్ సినిమాల పై ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: