50 మంది అమ్మాయిలను.. పడేసి.. వాడేసుకున్నాడు..!?

Chakravarthi Kalyan
ఆడవాళ్లను అర్థం చేసుకోవడం మహా కష్టమైన పని.. వాళ్లు హృదయంలో ఏముందో తెలుసుకోవడం అంత ఈజీ కాదు.. అందులోనూ వయసులో ఉన్న అమ్మాయిలైతే ఇక మరీ కష్టం.. అందుకే ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే అంటూ కుర్రాళ్లు తెగ ఫీలైపోతుంటారు. 

కానీ ఇది కొంతమందికి వర్తించదు.. వారు మాత్రం అమ్మాయిల మనసులో ఏముందో ఇట్టే పసిగట్టేస్తారు.. వారిని భలే సులభంగా లైన్లోకి లాగుతారు. అలాంటి వాడే ఈ రాహుల్ పాటిల్. అమ్మాయిలను మోసం చేయడం మనోడి హాబీ. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది వరకూ అమ్మాయిలను ఇతడు లైన్లో పెట్టేశాడట. 


వారితో పరిచయం పెంచుకుని లైంగికంగా వాడేసుకున్నాడట. శీలం దోచుకోవడమే కాదు.. వారికి రకరకాల కథలు వినిపించి డబ్బు కూడా స్వాహా చేసాడట.. మామూలు అమ్మాయిలైతే అంత ఈజీగా పడరని.. ఇతగాడు ఓ సెపరేట్ రూట్ ఎంచుకున్నాడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పెళ్లి కోసం ఎదురు చూసే అమ్మాయిల ప్రొఫైల్స్ సేకరించడం.. వారిని ఆకట్టుకునేలా పెళ్లి చేసుకుంటానంటూ కబుర్లు చెప్పడం.. చేసేవాడు. 

అలా అమ్మాయిలపై పెళ్లి వల వేసి శీలం, సొమ్ము దోచుకునే వాడు.. అవసరం తీరగానే.. మరో అమ్మాయికి వల విసిరేవాడు. ఇతగాడిపై ఇప్పటికే 30 మంది వరకూ అమ్మాయిలు ఫిర్యాదు చేశారట. ఇంజినీరింగ్ చదివానని.. లక్షలకు లక్షల జీతం వస్తుందని అమ్మాయిలకు కబుర్లు చెప్పేవాడు. కోట్ల ఆస్తులు ఉన్నాయని కటింగ్ ఇచ్చేవాడు. అమ్మాయిలు సులభంగా ఇతగాడి వలలో పడేవారు. ఓ నర్సు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసి మొత్తానికి ఈ నవ మన్మథుడని అరెస్టు చేశారు. సో.. అమ్మాయిలూ జాగ్రత్త. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: