ఏపీ: పొలిటికల్ ఎంట్రీ ఇస్తే కెరియర్ ఖతమేనా..?

Divya
సినీ సెలబ్రిటీలు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా మారుతోంది. కానీ ఎక్కువ కాలం ఎవరు సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. సినిమా వాళ్లు రాజకీయాలలోకి వస్తే. ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుందంటారు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యం.. కృష్ణ, కృష్ణంరాజు ఒకప్పుడు రాజకీయాలలోకి.. అప్పటిదాకా అద్భుతమైనటువంటి కెరియర్ ఆ తర్వాత దెబ్బతిన్నారు. పరిమిత కెరియర్ ముందుకు నడిచింది. అలాగే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు అద్భుతం.. ఆ తర్వాత తీసిన సినిమాలలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఆడినట్టు తెలుస్తోంది. తర్వాత చూసుకుంటే చిరంజీవి తన పొలిటికల్ కెరియర్ .. సినీ కెరియర్ రెండు దెబ్బతిన్నాయి.
పొలిటికల్ కెరియర్ విషయాన్ని పక్కన పెడితే.. సినీ కెరియర్ విషయానికి వస్తే.. చిరంజీవి గారు రాజకీయాలలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత తను నటించిన సక్సెస్ఫుల్ సినిమాలకి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎందుకు ఈ ప్రమాదము అంటే.. సహజంగా సినిమా వాళ్లు అంటే మనకు అందని ఎత్తులో ఉంటారు.. మనకి సర్ప్రైజ్ లాంటి వాళ్లు. వాళ్లని సడన్గా సూచినప్పుడు కాస్త షాకింగ్ గా అనిపిస్తుంది. ప్రతిరోజు జనం మధ్యలో చూస్తూ ఉన్నప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోరు..

సినిమాలలో ఉన్నప్పుడు ఎలాంటి చెప్పినా కూడ ప్రతి ఒక్కరూ పాటించడానికి చూస్తూ ఉంటారు.. ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు తమ హీరోలు ఏం చేస్తూ ఉంటారు అనే విషయం పైన అభిమానులు ఆలోచిస్తూ ఉంటారు. హీరోలైనా హీరోయిన్లైనా అందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇక రోజు చూడడం అలవాటైపోతే రొటీన్ గా ఉంటుంది. అప్పుడు ఆ ఇంపాక్ట్ సినిమాల మీద పడుతుంది. మరొకటి ఏమిటంటే సినీ ఇండస్ట్రీలో తెలుగుదేశం అనుకూల బ్యాచ్ ఎక్కువగా ఉంటుంది.. అదే సందర్భంలో జనసేన అనుకూల బ్యాచ్ సెకండ్ స్టేజ్ లో ఉంటుంది. వీరిద్దరూ కూడా సినీ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బ్యాచ్.

ఇప్పుడు జనసేన కోసం తెలుగుదేశం కోసం.. వస్తున్నటువంటి సినిమా రంగం వాళ్ళు విపరీతం.. అందులో ప్రధానంగా జబర్దస్త్ టీం లో ఉన్నటువంటి కమెడియన్స్ ముగ్గురు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సందుల సందులు తిరుగుతున్నారు. ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది, గెటప్ శీను పిఠాపురం అంతా తిరుగుతూ జనసేన ను గెలిపించాలని కోరుకుంటున్నారు. నిన్న మెగా హీరో వరుణ్ తేజ్ కూడా వచ్చి ప్రచారం చేశారు. 100 లో 98 % జనసేన పార్టీకి..2% టిడిపి పార్టీకి ఉన్నది. వైసీపీ తరపున పోసాని, ఆలీ వంటి వారు పదవులు అయితే తీసుకున్నారు. కానీ ఎన్నికలలో ప్రచారం చేయలేదు. వైసీపీ ధరణి ఎట్లుంటుంది అంటే కేవలం జగన్ మాత్రమే అక్కడ హైలెట్ గా ఉంటారు.. గతంలో చెల్లి తల్లి వంటి వారు ఉండేవారు.. ఇప్పుడు తాను అక్కడే ప్రచారం అన్నట్లుగా వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: