హర్భజన్ పై సన్రైజర్స్ ఫ్యాన్స్ ట్రోలింగ్.. ఎందుకో తెలుసా?

praveen
2024 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంత విజయవంతమైన ప్రస్థానం కొనసాగించింతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అప్పుడెప్పుడో 2016లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న హైదరాబాద్ జట్టు.. అప్పటినుంచి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇక టైటిల్ రేసులో వెనుకబడి పోతూనే ఉంది. అయితే అటు సన్రైజర్స్ జట్టులో బలమైన బ్యాటింగ్ విభాగం లేకపోవడంతోనే.. ఇక ప్రతి సీజన్లో అభిమానులకు నిరాశ తప్పడం లేదు. కేవలం బౌలింగ్ విభాగంతో మాత్రమే నెట్టుకుంటూ వస్తుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.

 అయితే 2024 ఐపీఎల్ సీజన్లో మాత్రం హైదరాబాద్ టీం ఎంత పటిష్టంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం బౌలింగ్లో మాత్రమే కాదు బ్యాటింగ్లో కూడా తమకు తిరుగులేదు అని నిరూపించింది. మహా మహా టీమ్స్ కి సైతం చెమటలు పట్టించింది. బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చేసి చూపించింది. ఏకంగా ఐపీఎల్ లోనే అత్యధిక స్కోరుని రెండుసార్లు బద్దలు కొట్టింది సన్రైజర్స్. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో తిరుగులేని జట్టుగా అవతరించింది అని చెప్పాలి. సన్రైజర్స్ జోరు చూస్తే ఈసారి తప్పకుండా టైటిల్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ భారత మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ మాత్రం సన్రైజర్స్ ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టడం కష్టమే అంటూ గతంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 అయితే ఇటీవల హైదరాబాద్, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రద్దు అయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్  వచ్చింది.  ఈ క్రమంలోనే సన్రైజర్స్ అధికారికంగా ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ జట్టు ప్లే ఆప్స్ కు వెళ్లలేదు అంటూ హర్భజన్ చేసిన వ్యాఖ్యలపై ఎస్సారెచ్ ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. హర్భజన్ అంచనాలను తలకిందులు చేస్తూ హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరింది. ఏం మాట్లాడాలో కాస్త చూసుకొని మాట్లాడండి తెలుసుకొని మాట్లాడండి అంటూ సన్రైజర్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. హర్భజన్ సింగ్ ని  మాత్రమే కాదు సన్రైజర్స్ ప్లే ఆఫ్ కు వెళ్లలేదు అని మరి కొంతమంది కామెంట్ చేయగా వారిని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: