ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో గెలిచేది ఏ పార్టీ?

Purushottham Vinay
•ఎన్నికలలో హాట్ టాపిక్ గా మారిన ఉత్తరాంధ్ర నియోజకవర్గాలు
•కీలక నియోజకవర్గాల్లో టీడీపీపై వైసీపీ పై చేయి

ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్: ఉత్తరాంధ్రలోని నియోజకవర్గాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరెవరికి ఎంత శాతం ఓట్లు పడతాయి? జనాల అభిప్రాయం ఏంటి? వంటి విషయాలు ఇండియా హెరాల్డ్ సర్వే ద్వారా తెలుసుకుందాం.

ఉత్తరాంధ్ర అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది చీపురుపల్లి నియోజకవర్గం. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తిరుగులేకుండా చక్రం తిప్పుతున్నారు. చీపురుపల్లి నుంచి ఆయన పోటీ చేస్తే విశాఖ ఎంపీగా ఆయన సతీమణి బొత్స ఝాన్సీ పోటీ చేశారు. చీపురుపల్లిలో బొత్సాని మాజీ మంత్రి కళా వెంకట్రావు ఢీ కొంటున్నారు. కానీ జనాల అభిప్రాయం ప్రకారం బొత్స గెలవడం పక్కా అని తెలుస్తుంది. ఇక విశాఖలో ఝాన్సీతో టీడీపీ నుంచి బాలకృష్ణ అల్లుడు భరత్ పోటీ చేశారు. వీరిద్దరిలో కూడా వైసీపీ తరుపున ఝాన్సీ గెలవడం పక్కా అని తెలుస్తుంది.శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ తరపున  కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వైసీపీ నుంచి తిలక్‌ పోటీ చేస్తుండగా టీడీపీ గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. టెక్కలిలో  టీడీపీ నుంచి మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇంకా వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తుండగా టీడీపీ గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది.

విశాఖ భీమిలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు.. ఇద్దరు బలమైన వారు కావడంతో భీమిలీ స్థానం అందరి దృష్టి ఆకర్షిస్తుంది. వీరిలో ఎవ్వరైనా గెలవొచ్చు. ఇద్దరికీ సమానంగా జనాల బలగం ఉంది.ఇక అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి మాజీ రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్ పోటీ చేయగా ఆయనపై వైసీపీ నుంచి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పోటీలో ఉన్నారు.ఇక్కడ వైసీపీ గెలవడం పక్కా అని తెలుస్తుంది.విజయనగరం మాజీ ఎంపీ అశోక్‌గజపతిరాజు పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకోవడం వల్ల  ఆయన కుమార్తె ఆదితిగజపతి విజయనగరం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఇంకా కోలగట్ల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైసీపీ గెలుస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: