కౌజు పిట్ట మాంసం తింటున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?

praveen
ఇండియాలో ఎక్కువగా తినే మాంసాహారం ఏది అంటే మటన్ చికెన్ అని చెబుతూ ఉంటారు అందరు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయిన ఇదే ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక కొంతమంది టర్కీ కోడి ఇతర పక్షుల మాంసం తినడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే వీటిలో ఇలా దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఈ క్రమంలోనే కౌజు పిట్టల మాంసానికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది జనాలు వీటి మాంసాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు అని చెప్పాలి.

 ఒకప్పుడైతే అడవుల్లో వెళ్లి ఇలా కౌజు పిట్టలను పట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది  మార్కెట్లో కౌజు పిట్టల మాంసానికి ఉన్నాం డిమాండ్ దృశ్య ఇక వీటిని కోళ్ల లాగానే ఫారాలు ఏర్పాటు చేసి పెంచుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే కౌజు పిట్ట అనేది కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచంలోనే అనేక ప్రాంతాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. కాగా కౌజు పిట్ట కర్రీ మిగతా పక్షుల మాంసాలతో పోల్చి చూస్తే ఎంతో రుచికరంగా ఉంటుందని కూడా చెబుతూ ఉంటారు అందరూ. అయితే ఈ పక్షులలో ఒక జాతి మాత్రం చాలా విషపూరితమైనదట.

 ఇక ఈ కౌజు పిట్ట జాతిలోనే కామన్ కాయిల్ అనే జాతి పక్షి మాంసం తినడం మాత్రం ఎంతో ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. కామన్ కాయిల్ ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. ఎక్కువ దూరం ఎగరలేదు. గూళ్ళలోనే ఉంటుంది. అయితే ఈ పక్షి మాంసం తినడం ఎంతో ప్రమాదకరమట. శీతాకాలపు వలస సమయంలో ఈ పక్షులు కొన్ని విషపూరితమైన మొక్కలను తింటాయట. దీంతో ఆ విషం పక్షుల శరీరంలోనే ఉండిపోతుందట. ఆ సమయంలో ఆ పక్షి మాంసం తింటే చివరికి అనారోగ్యం పాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. ఏకంగా కండరాలు క్షీణించడంతోపాటు కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందట. వికారం వాంతులు లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయట. కొన్ని సందర్భాల్లో కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కౌజు పిట్టలను వలస సమయంలో వేటాడి తినకూడదని చెబుతున్నారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: